మంచు విష్ణుపై ప్రభాస్ ఫ్యాన్స్ కేసు నమోదు.. ఏమైంది?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా 'కన్నప్ప' చిత్రంలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించారు. తిన్నడు అనే శివభక్తుడు పాత్రను పోషించారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మాసీవ్ రెస్పాన్స్ దక్కడం విశేషం. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కూడా కీలక పాత్ర పోషించడంతో డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా కన్నప్ప సినిమా కోసం ఎదురు చూశారు. ఎట్టకేళలకు సినిమా థియేటర్లలోకి రావడంతో మొదటిరోజే భారీ అంచనాలతో చూసేందుకు వెళ్లారు. అయితే తాజాగా ప్రభాస్ అభిమానులు తమను మంచు విష్ణు మోసం చేశాడని ఆరోపించడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

కన్నప్ప చిత్రం విశేషాలు..
కన్నప్ప చిత్రానికి హిందీ మహా భారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించడం విశేషం. మంచు విష్ణు తిన్నడు పాత్రలో అలరించారు. అలాగే మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా అలరించారు. ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా అలరించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్రగా, అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీగా, మోహన్ లాల్ కిరాటగా అలరించారు. AVA ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లలో సంయుక్తంగా నిర్మించారు. మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. స్టీఫెన్ దెవస్సీ అద్భుతమైన సంగీతం అందించారు.

Prabhas Fans angry on Manchu Vishnu

కన్నప్ప చిత్రంపై ఎలాంటి అభిప్రాయాలు..
మంచు ఫ్యామిలీ నుంచి రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ భారీ ప్రాజెక్ట్ కన్నప్ప రూపుదిద్దుకుంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం నటించడం కారణంగా ఈ సినిమాపై రిలీజ్ కు ముందే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన నెలకొంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ ఆడియెన్స్ ఓపికను పరీక్షించేలా ఉంటుందని, సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ములేచి పోతుందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలోని విజువల్స్, అదిరిపోయే బీజీఎం, సాంగ్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాలో ఆకట్టుకునే అంశాలని చెబుతున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం..
మంచు విష్ణుపై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు తొలుత భక్త కన్నప్ప చిత్రాన్ని తీస్తున్నానని చెప్పి.. తిన్నడి పాత్రనే ఎక్కువ చూపించాడని, భక్త కన్న చిత్రమన్నప్పుడు భక్తి ఎందుకు చూపించలేదని ఆరోపించారు. ప్రథమార్థంలో శివుడి గురించి ఒక్క సీన్ కూడా చూపించలేదని, అసలు భక్తే లేదని మండిపడ్డారు. ప్రభాస్ చిన్నాన కృష్ణంరాజు డ్రీమ్ ప్రాజెక్ట్ రైట్స్ ను మంచు విష్ణుకు ఇస్తే కథను మార్చేసి, మొదటి అర్థంలో తిన్నడి ప్రావీణ్యాన్ని చూపించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

అసలు భక్త కన్నప్పను చూపించాలి అనుకున్నారా? తిన్నడుని చూపించాలని అనుకున్నారా? ట్రైలర్, ప్రమోషన్స్ లో చూపించిన వాటికి సినిమా భిన్నంగా ఉందని మీడియాతో చెప్పారు. ప్రభాస్ అభిమానులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కేసు నమోదు చేయబోతున్నామని తెలిపారు. మొదటి భాగంలో సినిమా మొత్తం మంచు విష్ణు ప్రావీణ్యమే కనిపిస్తూ ఉంటుంది. ప్రభాస్ అభిమానులు చాలా హర్ట్ చేశారని వారు వాపోయారు. ఇక దీనిపై టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

More from Filmibeat

Read more about: prabhas kannappa manchu vishnu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X