twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీలంకన్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్.. కోపంగా ఉన్న ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే

    |

    Recommended Video

    #BadBoySongFromSaho : Prabhas Romance With Jacqueline Fernandez || Filmibeat Telugu

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. బాహుబలి వంటి భారీ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కావడానికి తోడు హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన ప్రాజెక్టు అవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికితోడు, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత వస్తున్న ప్రభాస్ చిత్రం కావడంతో ఆయన అభిమానులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ చేసిన పనికి వాళ్లంతా నిరాశలో ఉన్నారు.

     ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చూపించారు

    ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చూపించారు

    ‘సాహో'లోని రెండు పాటలు ఇది వరకే విడుదలైన విషయం తెలిసిందే. ఇక, ఇందులోని మూడో సాంగ్‌ను ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వదిలారు. ‘బ్యాడ్ బాయ్' అంటూ సాగే ఈ పాటలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్ చిందులేశాడు. వాస్తవానికి ఈ సినిమాలో జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై ఎవరూ స్పందించలేదు. అలాంటిది ఈవెంట్‌లో ఒక్కసారిగా దీన్ని విడుదల చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

    ఫ్యాన్స్ నిరాశ

    పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని, హాట్ హాట్‌గా కనిపిస్తున్న భామల మధ్య ప్రభాస్ ఒక్కడే ఉన్న ఈ సాంగ్‌ను ఈవెంట్‌లో విడుదల చేశారు. కానీ, యూట్యూబ్‌లో వదల్లేదు. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. హాట్ సాంగ్ కావడానికి తోడు ప్రభాస్ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తున్నందున వాళ్లంతా ఈ పాటను చూడాలని భావిస్తున్న ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేసినా ఉపయోగం లేదు

    ట్విట్టర్ పోస్ట్ చేసినా ఉపయోగం లేదు

    ఈ సాంగ్‌ను లాంచ్ చేస్తున్నట్లు యూవీ క్రియేషన్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఈ పాటకు సంబంధించిన రెండు ఫొటోలను కూడా ఉంచింది. అలాగే, ఓ యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చింది. అయితే, ఆ లింక్ క్లిక్ చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్‌లోకి వెళ్తోంది. దీంతో ఆశగా ఓపెన్ చేసిన వారందరూ నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలోనే సదరు సంస్థను కామెంట్ల రూపంలో తిట్టి పోస్తున్నారు.

    సాహో గురించి..

    సాహో గురించి..

    యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ఏ, విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సరసన శ్రధ్ధాక‌పూర్‌ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

    జాక్వెలిన్ గురించి

    జాక్వెలిన్ గురించి

    మాజీ మిస్ శ్రీలంక యూనివర్స్‌‌గా గెలిచిన తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జక్వెలిన్. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అలాదిన్'తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాక్వెలిన్.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. దీంతో ఆమెకు బీ టౌన్‌లో మంచి పేరు వచ్చింది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. జాక్వెలిన్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది.

    English summary
    Saaho Pre Release Event LIVE Coverage. Saaho is a Multi-Lingual Indian Movie ft. Rebel Star Prabhas and Shraddha Kapoor. Directed by Sujeeth and Produced by Vamsi and Pramod under UV Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X