twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో గారి క్రేజీ స్టైలిష్ లుక్స్ నచ్చలేదంటూ: ఫ్యాన్స్ గోల

    By Sindhu
    |

    'డార్లింగ్‌", 'మిస్టర్‌ పెర్ఫెక్ట్‌"తో వరుసగా ఘనవిజయాలందుకున్న ప్రభాస్‌ ఈ సారి రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో 'రెబల్‌"గా మారాడు. సరికొత్త రూపంతో మాస్‌ స్టైల్‌ లో అలరించడానికి వచ్చేస్తున్నాడు. స్థానిక లొకేషన్లు సహా కొంతభాగం బ్యాంకాక్‌ లోనూ ఈ సినిమా తెరకెక్కింది. ప్రభాస్‌ కెరీర్‌ లోనే భారీ ఖర్చుతో రూపొందుతున్న సినిమా ఇది. తమన్నా, దీక్షాసేథ్‌ రెబల్‌ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    శ్రీ బాలాజీ సినీమీడియా పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. పవర్‌ ఫుల్‌ కథాంశంతో టైటిల్‌ కి తగ్గట్టే..స్టైలిష్‌ గా, మాసీగా సినిమా ఉంటుందని, మాస్‌ సెంటర్లల్లో వసూల్‌ రాజాలా నిలిచే సినిమా ఇదని..నిర్మాతలు చెబుతున్నారు. అలాగే నిర్మాణానంతర పనులు పూర్తిచేసుకుని త్వరలోనే రిలీజ్‌కు సన్నాహాలు సైతం జరుగుతున్నాయి.

    కాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ లో కొంతమంది తీవ్ర నిరాశతో ఉన్నారట. దానికి కారణం ఈ మధ్య రిలీజ్ చేసిన ప్రభాస్ ఫొటోలే. రెబల్ షూటింగ్ టైం లో రిలీజ్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. రెబల్ టైటిల్ కు తగ్గట్టుగా రఫ్ లుక్ తో... కసి కసిగా ఉండే ఫొటోలు రిలీజ్ చేస్తారని ఆశించారట. ప్రభాస్ బర్త్ డే కోసమే స్పెషల్ గా రిలీజ్ చేసిన ఫొటోల్లో రెబల్ మూవీ ఛాయలు ఏమాత్రం కనిపించక పోవడంతో బాగా అప్ సెట్ అయ్యారట. ఈ ఫొటోలు చూడ్డానికి బాగున్నా... ఫ్యాన్స్ రెబల్ మేనియాలో ఉండడంతో నిరాశపడాల్సి వచ్చింది. పాపం ప్రభాస్ ఫ్యాన్స్ చేసేది లేక క్రేజీ స్టైలిష్ లుక్స్ తో ఉన్న ఆ ఫొటోలనే చూసి మురిసిపోతున్నారు. ఏదేమైనా ఈ ఫొటోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

    English summary
    Director Lawrence says only those who are uncompromising, who can afford to take risks, do something out of the box, something unconventional can be labelled as beinga Rebel. To become a hero one has to be rebel and the story deals with one such youth who has the above qualities and who doesn't think twice in taking a daring step forward.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X