Prabhas Fans: సర్వనాశనమైన సుదర్శన్ థియేటర్.. పోలీసుల కస్టడీలో ప్రభాస్ ఫ్యాన్స్‌

ఈ మధ్య కాలంలో రిరిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు కాదు. గతంలో నుంచే రీ రిలీజ్ ట్రెండ్ ఉంది. నేటి కాలంలో రిరిలీజ్ ట్రెండ్ కు సూపర్ క్రేజ్ దక్కుతుంది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు దర్శకనిర్మాతలు స్టార్ హీరోల సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అభిమానులు అత్యుత్సాహం చూపిస్తూ పలువురికి ఆగ్రహం తెప్పిస్తున్నారు. అభిమానం పేరుతో థియేటర్లను సర్వనాశన చేస్తున్నారు. తాజాగా ఓ చిన్న కారణంతో సుదర్శన్ థియేటర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఆయన పేరు చెబితే చాలు విజిల్స్ పడతాయి. అరుపుల కేకలతో థియేటర్లు మారు దద్దరిల్లి పోతాయి. ఈశ్వర్ సినిమా నుంచి ఆదిపురుష్ వరకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్న ప్రభాస్ సినిమాల ఫలితం ఎలా ఉన్నా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఐదారు సినిమాలతో అభిమానులను సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. వాటిలో సలార్, కల్కి 2898 ఏడీ, స్పిరిట్, రాజా డీలక్స్ కాకుండా మరికొన్ని ఉన్నాయి.

Prabhas Fans Destroyed Sudarshan Theatre Over Yogi Re Release

రీ రిలీజ్ ట్రెండ్ సందర్భంగా ఇటీవల ప్రభాస్ నటించిన యోగి (Yogi) సినిమాను 4K వెర్షన్ లో విడుదల చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్, నయనతార జత కట్టిన యోగి మూవీని ఆగస్టు 18న థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేయగా అభిమానులు భారీగా తరలివెళ్లారు. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో (Sudarshan Theatre 35MM) యోగి సినిమాను ప్రదర్శించారు. అయితే సినిమా రన్ అవుతుండగా.. సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది.

యోగి సినిమా అనుకోకుండా నిలిచిపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. ఏకంగా బ్లేడ్ తో సినిమా స్క్రీన్ ను కోసేశారు. థియేటర్ అద్దాలు పగుల గొట్టారు. క్యాంటీన్ లోని వస్తువులను విసిరిపారేశారు. కూల్ డ్రింక్స్ సీసాలను బయటకు విసిరి పగులగొట్టారు. కుర్చీలు సైతం విరగొట్టారు. ఇలా థియేటర్ మొత్తం సర్వనాశనం చేసి బీభత్సం సృష్టించారు డార్లింగ్ అభిమానులు. దీంతో సీరియస్ అయిన థియేటర్ యాజమాన్యం ప్రభాస్ అభిమానులపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

థియేటర్ ధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు జరిగిన నష్టాన్ని వారి నుంచి వసూలు చేయాలని కోరింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదులు చేశారు. పలువురుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై ప్రభాస్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X