Prabhas: ఆదిపురుష్ పెద్ద రాడ్ సినిమా.. 'ఆచార్య'తో పోలిక.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారంటే?
హీరోలు అంటే అభిమానులకు ప్రాణం. ఎనలేని ప్రేమ. వారికోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడతారు. అయితే ఒక్కోసారి వారి ప్రేమ హద్దులు దాటుతుంది. తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమతో ఇతరులకు ఎలాంటి నష్టం కలుగుతుందనేది ఆలోచించట్లేదు ఫ్యాన్స్. తమ అభిమాన హీరోలను ఏ ఒక్క మాట అన్న అస్సలు ఊరుకోరు ఈ అభిమానులు. హీరోలు, వారికి సంబంధించిన విషయాలను చాలా పర్సనల్ గా తీసుకుంటారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి, ఆయన అభిమానుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ వ్యక్తితో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు కలవరం సృష్టించింది.
మరాఠీ నటుడు:రామాయణం ఆధారంగా తెరకెక్కిన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్ అలరించిన ఈ సినిమాలో పది తలల రావణబ్రహ్మగా సైఫ్ అలీ ఖాన్, సీతాదేవిగా బ్యూటిఫుల్ కృతి సనన్ కీలక పాత్రలు పోషించారు. ఇక హనుమంతుడి పాత్రలో మరాఠీ పాపులర్ నటుడు దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు.

తానాజీ దర్శకుడు:ఆదిపురుష్ సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మాణంలో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రశాంత్ సుతార్ నిర్మాతలుగా వ్యవహరించారు. అలాగే తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. తానాజీ వంటి హిట్ చిత్రం తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ ఆదిపురుష్ మూవీకి దర్శకత్వం వహించారు.
ఆగ్రహానికి గురి:ఎన్నో భారీ అంచనాల నడుమ జూన్ 16న అంటే ఇవాళ ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఆదిపురుష్ సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాక్ రావడంతో సంబురాలు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం అంతగా బాలేదని పెదవి విరుస్తున్నారు. అలా చెప్పిన ఓ వ్యక్తిపై ఆగ్రహానికి లోనయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్.

సినిమా రాడ్డు:హైదరాబాద్ ఐమాక్స్ మల్టీ ప్లెక్స్ థియేటర్ వద్ద ఐదిపురుష్ బెనిఫిట్ షోలు వేశారు. సినిమా ఎలా ఉందని ఆడియెన్స్ మీడియా రివ్యూ చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని సినిమా ఎలా ఉందని అడిగితే 'బాలేదు' అని అసహనంగా చెప్పాడు. 'సినిమా రాడ్డా' అని అడిగితే.. 'ఇంతది' అని 'పెద్ద రాడ్ సినిమా' అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు.
త్రీడీ ప్రభాస్:"ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడట్లేదు. సినిమాలో త్రీడీ ప్రభాస్ ను చూపించారు. ఆచార్య సినిమాలో చిరంజీవిని ఎలా చూపించారో అలా ప్రభాస్ ను చూపించారు. ప్లే స్టేషన్ లో ఉన్న రాక్షసులను ఇందులో దింపారు. హనుమంతుడు, బీజీఎమ్ స్కోర్, అక్కడక్కడ త్రీడీ షాట్స్ తప్పా ఏం లేదు. రాముడిగా ప్రభాస్ అస్సలు సూట్ కాలేదు. బాహుబలిలో ప్రభాస్ ను చూస్తే ఒక రాయల్టీ కనిపిస్తుంది. అది చూసి ఇందులో తీసుకున్నారు కానీ, ప్రభాస్ ను ఓం రావత్ సరిగా చూపించలేదు" అని ఓ వ్యక్తి తెలిపాడు.
వీడియో వైరల్:ఆ వ్యక్తి చెప్పిదంతా విన్న ప్రభాస్ అభిమానులు అతనిపై ఫైర్ అయ్యారు. "అసలు నువ్వు ఏం చూశావ్", "ఏం చూశావ్", "కళ్లు కనిపిస్తాయా నీకు" అంటూ బూతులు మాట్లాడారు. "నీకు మంచిగా చెబుతున్నామ్ ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో" అంటూ ఆగ్రహానికి లోనయ్యారు. ఆ వ్యక్తి కూడా వాగ్వాదానికి దిగడంతో కోపంతో అతన్ని చితక బాదారు. దీంతో అక్కడున్న మీడియా అతన్ని కొట్టడాన్ని ఆపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











