HanuMan: హనుమాన్ సూపర్ హిట్... ఆ దర్శకుడిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా సంక్రాంతి పండుక శోభ కనిపిస్తోంది. దీనికి తోడు తెలుగు ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు సందడి రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. అందులో హనుమాన్ సినిమా ఒకటి. అయితే ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ.. తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమా నార్త్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండగా... ఓ దర్శకుడిపై మాత్రం దుమ్మెత్తి పోతున్నారు నెటిజన్స్. ఆ వివరాల్లోకి వెళితే...
టాలీవుడ్ యంగ్ టాలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కొత్త సినిమా 'హనుమాన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. రిలీజ్ కి ముందు ప్రశాంత్ మాటలు విని ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంతా అనుకున్నారు. కానీ సినిమా చూసిన తరువాత అది తన టాలెంట్ పై ఉన్న నమ్మకమని అందరికీ అర్ధం అయింది. ట్రైలర్ అండ్ టీజర్ లో ఏ విజువల్స్ తో ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక మూవీ మొత్తం కూడా అదే రేంజ్ క్వాలిటీ విజువల్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు.
Recommended Video


తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇక 30 కోట్ల విజువల్స్ చూస్తే.. 100 కోట్ల విజువల్స్ లా కనిపించాయంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడుతుంటే.. ముందుగా గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమాలో చాలా వరకు గ్రాఫిక్స్ షాట్స్, VFX సీన్స్ ఉపయోగించారు. VFX ఉన్న అన్ని సీన్స్, షాట్స్ చాలా నేచురల్ గా రూపొందించారు. కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ కలిగించాయి.
ముఖ్యంగా ఆంజనేయ స్వామి షాట్స్ ఆడియన్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే.. సినిమాలో చాలా సీన్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇక ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ అవుట్ ఫుట్ చూసిన ఆడియన్స్ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే... ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని రాముడిగా చూపిస్తూ.. ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రామాయణం తెరకెక్కిస్తున్నానంటూ ఓం రౌత్ తనకు నచ్చిన విధంగా సినిమాను చిత్రీకరించారంటూ ఫైర్ అవుతున్నారు. రామాయణ కథని చెడగొట్టడమే కాకుండా, దాదాపు 700 కోట్ల వరకు ఖర్చు పెట్టి బొమ్మల గ్రాఫిక్స్ చూపించారని కామెంట్స్ వినిపించాయి.

ఆదిపురుష్ గ్రాఫిక్స్ తో పోలిస్తే.. హనుమాన్ గ్రాఫిక్స్ 100 శాతం కూడా 1000 శాతం బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తెలుగు ఆడియన్స్, ప్రభాస్ ఫ్యాన్స్.. ఓం రౌత్ ని సోషల్ మీడియాలో మరోసారి ట్రోలింగ్ చేస్తూ... దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకసారి హనుమాన్ సినిమా చూడండి అంటూ ఓం రౌత్ కు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.


Click it and Unblock the Notifications











