మారుతి నీ ఇంటికే వస్తున్నాం.. అడ్రస్ మార్చుకో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం
సంక్రాంతి పండుగ రిలీజ్‌లో భాగంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజాసాబ్ చిత్రంపై ప్రభాస్ అభిమానులు నుంచి వస్తున్న రియాక్షన్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీస్తున్నది. యువ దర్శకుడు మారుతి రూపొందించిన ఈ సినిమాపై రెబల్ స్టార్ అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా గంపెడు ఆశలతో థియేటర్లకు పోటెత్తారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ల తర్వాత ఊహించని స్పందన ప్రేక్షకుల నుంచే కాకుండా ఏకంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి రావడం ఆసక్తికరమైన పరిమాణంగా మారింది. ఈ సినిమాపై, దర్శకుడు మారుతిపై సాధారణ ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..
ది రాజాసాబ్ ప్రమోషన్స్ సందర్బంగా చిత్ర యూనిట్ చెప్పిన విషయాలు ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రీమియర్ల తర్వాత ఆడియెన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైనట్టు కనిపిస్తున్నారు. తొలి ఆట తర్వాత వారు చాలా విషయాలు జీర్ణించుకోలేకపోతున్నట్టు వారు మీడియాతో చేసిన చిట్‌చాట్ స్పష్టం చేసింది. ముఖ్యంగా సినిమాలోని కంటెంట్, మారుతి దర్శకత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభాస్ లాంటి హీరోను పెట్టుకొని ఇలాంటి సినిమాను తీస్తారా? అనే ప్రశ్నలతో ఏకి పారేస్తున్నారు.

సంక్రాంతి పండుగకు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలన్నదే మా కోరిక. ఇంత బడ్జెట్ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చారు. అన్ని భాషల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే సినిమా. నేనే తీసిన సినిమా చూస్తే నాకే కన్నీళ్లు వచ్చాయి. ప్రభాస్ పెర్ఫార్మెన్స్ చూసి ఏడ్చాను. ప్రాణం పెట్టి ప్రభాస్ వర్క్ చేశారు. ఆయనకు రుణపడి ఉంటాను అని ఎమోషనల్ అయ్యారు.
అయితే రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మారుతి ప్రసంగాన్ని ఈ సందర్భంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో మిమల్ని ఒక పర్సెంట్ నిరాశపరిచినా నా ఇంటి అడ్రస్ పెడుతాను రండి. రెబెల్స్ స్టార్ ఫ్యాన్స్, ఫ్యామిలీస్ గానీ, ప్రభాస్‌ను ప్రేమించే వారు ఎవరైనా ఒక శాతం నిరాశ చెందినా.. మారుతి నీవు డిసాపాయింట్ చేశావు అని ఫీలైతే.. నా ఇల్లు కొండాపూర్‌లో ఉంటుంది. అక్కడికి వచ్చి నన్ను నిలదీయండి అంటూ తన ఇంటి అడ్రస్ చెప్పడం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని పట్టుకొని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ది రాజాసాబ్ సినిమా ప్రీమియర్ల తర్వాత ప్రభాస్ అభిమానులు, ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ తీవ్రమైన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మారుతి తన ఇంటి అడ్రస్ మార్చుకోవాలి. మేము ఆయన ఇంటికి వెళ్లి ఈ సినిమా గురించి అతడిని నిలదీస్తాం. ఎందుకైనా మంచిది ఇంటిని షిఫ్ట్ చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చినంత పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇక అమెరికాలో ప్రభాస్‌ను అభిమానించే లేడీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మారుతి గారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీ ఇంటి అడ్రస్ ఇచ్చారు కదా. అర్జెంట్‌గా అక్కడి నుంచి చెక్కేయండి. 30 డాలర్లు దండగ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం ట్రెండింగ్‌గా మారింది.


Click it and Unblock the Notifications











