twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోలను అనే దమ్ముందా? ప్రభాస్ మీద ఎందుకు ఏడుస్తావ్? ఫ్యాన్స్ ఫైర్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Siddarth Tweets To Prabhas Fans

    అభిమానులు తాము అభిమానించే హీరోల సినిమాలైనా, బర్త్ డే వేడుక అయినా ఒక పండగలా జరుపుకుంటారు. ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో తమ హీరో పేరుతో హాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేయడం ఇపుడు ఒక ఆనవాయితీగా మారింది. అందరి హీరోల మాదిరిగానే హీరో ప్రభాస్ అభిమానులు కూడా తమ రెబల్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని వందరోజుల ముందుగానే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. #100DaysToKingPRABHASBday అంటూ ట్విట్టర్లో సందడి పెట్టారు. దీనిపై తమిళ హీరో సిద్ధార్థ్ కామెంట్ చేయడం ప్రభాస్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

    సిద్ధార్థ్ ఏమన్నాడంటే..?

    సిద్ధార్థ్ ఏమన్నాడంటే..?

    100 రోజుల తర్వాత ప్రభాస్ బర్త్ డే అయితే ఏంటి? ఆ తర్వాత బర్త్ డే 465 రోజుల తర్వాత వస్తుంది అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఇలా అనవసరమైన హాష్ ట్యాగ్స్ క్రియేట్ చేయొద్దు అనే హితబోధ చేసే ప్రతయ్నం చేశాడు.

    ఆ హీరోలను అనే దమ్ముందా?

    సిద్ధార్థ్ కామెంట్లతో కలత చెందిన ఫ్యాన్స్.... నువ్వు ఇదే ట్వీట్ అజిత్, విజయ్, రజనీ బర్త్ డే సమయంలో చేసే దమ్ముందా? నువ్వు ఇలాంటి ట్వీట్ చేసిన మరుక్షణమే నువ్వు ట్విట్టర్ వదిలిపోయేలా చేస్తారు... అంటూకౌంటర్ ఇచ్చారు.

    ఇలాంటివి చేయడం జోక్ అయిపోయింది

    రోజు రోజుకు హాష్ ట్యాగ్స్ క్రియేట్ చేయడం అనేది ఒక జోక్ అయిపోయింది. ప్రజలు ఇలాంటివి చూసి నవ్వుతున్నారు. ఎవరూ ట్విట్టర్ వీడాల్సిన అవసరం లేదు. జోక్ వేస్తే నవ్వాలి అంటూ తనపై ఫైర్ అవుతున్న ప్రభాస్ అభిమానులను రిలాక్స్ చేసే ప్రయత్నం చేస్తూనే రివర్స్ కౌంటర్ ఇచ్చాడు సిద్ధార్థ్.

    దీనికి సీరియస్ అవ్వాల్సిన పనేముంది?

    ట్విట్టర్లో ఇతరులను దూషించడం ఈ మధ్య ఒక అలవాటుగా మారింది. సోషల్ మీడియా కల్చర్, ఫ్యాన్ బిహేవియర్ వెర్రితలలు వేస్తోంది. నేనైనా, ఇంకెవరైనా ప్రభాస్ లాంటి హీరో మీద జోక్ వేయడానికి ఎందుకు భయపడాలి? సీరియస్ ఇష్యూల మీద సీరియస్ అవ్వాలి... జోక్ వేస్తే కాదు అంటూ సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు.

    ప్రభాస్ నా ఫ్రెండ్ కాబట్టే ఫ్రీడమ్ తీసుకున్నా

    ఎందుకు భయ్యా... ప్రభాస్ నీ ఫ్రెండే కదా? అని అభిమాని రిప్లై ఇవ్వగా సిద్ధార్థ్ స్పందిస్తూ..... నా ఫ్రెండ్ కాబట్టే ఫ్రీడమ్ తీసుకున్నాను. నేను వేసిన జోక్ విని డార్లింగ్ కూడా నవ్వుతాడు. ప్రతి దానికి మీరు టెన్షన్ పడితే ఎలా.... అంటూ ప్రభాస్ అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశాడు సిద్ధార్థ్.

    English summary
    Prabhas fans twitter war with hero Siddharth regaeding #100DaysToKingPRABHASBday issue. "Day by day the #Hashtag is becoming a joke... I think people can laugh at a joke. Nobody needs to leave Twitter. Relax, take a deep breath and laugh at a joke.How is that fun? Being abused by people is common on twitter. Social media culture and fan behaviour has gone to another level of abuse. Why should anyone be scared to make a joke? People need to get serious and angry about many serious issues; not about jokes! Jokers will joke:)" Siddharth tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X