»   » పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓవరాక్షన్, ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓవరాక్షన్, ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దరాబాద్: వరుణ్ తేజ్, దిశా పటాని జంటగా నటించిన లోఫర్ చిత్ర ఆడియో వేడుక సోమవారం సాయంత్రం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ప్రభాస్, రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అయితే ఆడియో వేడుక జరుగుతుండగా కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఓవరాక్షన్ చేసి ఇబ్బంది పెట్టారు.

పవన్ స్టార్ పవర్ స్టార్ అంటూ గోల చేస్తూ స్టేజీపై మాట్లాడే వారికి ఇబ్బంది కలిగించారు. ప్రభాస్ మాట్లాడుతున్న సమయంలో కూడా ఇబ్బంది పెట్టారు. దీంతో ప్రభాస్ మాట్లాడుతూ... ఐ లైక్ పవర్ స్టార్, వరుణ్ తేజ్ కూడా భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ లా పెద్ద హీరో అవుతాడు అంటూ వారిని శాంతింప చేసే ప్రయత్నం చేసారు.

Prabhas Fans VS Pawan Kalyan Fans

అయితే కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా ప్రతి ఆడియో వేడుకలోనూ చిల్లరగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో డిగ్నిటీగా ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వీరి మూలంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న సభల్లోనూ అభిమానులు ఇలానే గొడవ చేయడం.... పలు సందర్భాల్లో నాగ బాబు వారికి చీవాట్లు పెట్టడం తెలిసిందే.

అయితే తమ హీరో ముఖ్య అతిథిగా పాల్గొన్న వేడుకలో.... పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా రచ్చ చేయడంపై ప్రభాస్ అభిమానులు సీరియస్ గా ఉన్నారు. అయితే కొందరు ఆకతాయిలే ఇలా చేస్తున్నారని, నిజమై అభిమానులు ఇలాంటి చిల్లర పనులు చేయరని పవన్ కళ్యాణ్ వీరాభిమానుల వాదన.

English summary
After the infamous Bhimavaram Prabhas and Pawan Kalyan fans fight, the fans of the heroes once again locked their heads at Varun Tej's Loafer audio release yesterday, to which Prabhas was the chief guest. Though they did not get into a scuffle like the last time, they created chaos with their over-enthusiasm.
Please Wait while comments are loading...