Prabhas: టికెట్ లేకుండానే సలార్ సినిమా.. టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలా!
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' ఒకటి. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమాపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని రెండు పార్టులుగా రూపొందించారు. అందులో మొదటి దాన్ని 'సలార్: సీజ్‌ఫైర్' పేరిట ఈరోజే (డిసెంబర్ 22న) ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ తెలిసింది. ఆ వివరాలను మీరే చూడండి!
పాన్ ఇండియా స్థాయికి చేరిన రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ తాజాగా ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది. హైప్‌కు అనుగుణంగానే ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అంతటా ఈ సినిమా హడావిడే కనిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' బెనిఫిట్ షోలను ఈరోజు రాత్రి 1 గంటకు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం పర్మీషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలోని ప్రధాన థియేటర్లలో రాత్రి 1 గంటకే ఈ సినిమా షోలు ప్రదర్శితం అయ్యాయి. అన్ని చోట్లా ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.
'సలార్: సీజ్‌ఫైర్' సినిమా రాత్రి 1 గంటకు ప్రదర్శించిన షోల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గరకు వందల సంఖ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ రావడంతో పరిస్థితి చేయి దాటింది. ఫలితంగా పోలీసులు కలుగజేసుకుని అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. అలాగే, మల్లికార్జున థియేటర్‌లోనూ ఇదే కనిపించింది.
'సలార్: సీజ్‌ఫైర్' సినిమాకు సంబంధించి రాత్రి 1 గంటకు ప్రదర్శితం అయిన షోను చాలా మంది టికెట్ లేకుండానే వీక్షించినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని సంధ్య, మల్లికార్జున థియేటర్లలో వందల సంఖ్యలో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను ఉచితంగా వీక్షించారని తెలిసింది.

వాస్తవానికి రాత్రి 1 గంటలకు 'సలార్: సీజ్‌ఫైర్' షో ప్రదర్శితం అవ్వాల్సి ఉంది. ఇందుకోసం సంధ్య, మల్లికార్జున థియేటర్ల వద్దలకు భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు చేరుకున్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు ముందుగానే గేట్లు ఓపెన్ చేయడంతో పరిమితి కంటే వందకు పైగానే జనాలు లోపలికి చేరుకుని నిల్చుని మరీ సినిమాను చూసినట్లు చెప్తున్నారు.
ఒక్కసారిగా వందకు పైగా అభిమానులు థియేటర్లలోకి చేరడంతో టికెట్లు కొనుక్కొని సినిమా చూడాలనుకున్న వాళ్లు చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చేతులు ఎత్తేసిని థియేటర్ల యాజమాన్యాలపై సదరు ప్రేక్షకులు ఫైర్ అవుతున్నట్లు తెలిసింది. మొత్తానికి చాలా మంది టికెట్ లేకుండానే తమ అభిమాన హీరో సినిమాను చూసేశారన్న మాట.


Click it and Unblock the Notifications











