ఫారిన్ ఫైటర్స్ తో చిక్కుల్లో పడిన ప్రభాస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, 'తొలిప్రేమ",'బాలు", 'హ్యాపి" మరియు 'ఉల్లాసంగా ఉత్సాహంగా", కరణాకరన్ దర్శకత్వంలో 'ఛత్రపతి" ప్రసాద్ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'డార్లింగ్" కోసం బ్యాంకాక్ లో జనవరి 21 నుండి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో భారీ పైట్ ని పది రోజుల పాటు చిత్రీకరిస్తారు. ఈ పైట్ లో ప్రభాస్ తో ఫారిన్ ఫైటర్స్ పాల్గొంటారు. ఈ చిత్రానికి ఈ పైట్ ఓ హైలెట్ అవుతుంది.
మగధీర, ఆర్య 2, సహా నిర్మాత, నిర్మాత బి.వి.ఎస్.ఎన్, ప్రసాద్ మాట్లాడుతూ 'చత్రపతి" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ప్రభాస్ తో మా బ్యానర్లో చేస్తున్న ఈ చిత్రాన్ని స్విట్జర్లాండ్ లో, అరకులో వేసిన భారీ సెట్ లో, హైదరాబాద్ లో జరిపిన షెడ్యూల్స్ తో 70 శాతం పూర్తయింది. బ్యాంకాక్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో జరిగే మరో షెడ్యూల్ తో ఫిబ్రవరికల్లా షూటింగ్ పూర్తి అవుతుంది. ప్రభాస్ కెరీర్ లో డిఫరెంట్ రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని కరుణాకరన్ అద్భుతంగా తీస్తున్నారు. మార్చిలో విడుదలయ్యే ఈ చిత్రం మా బ్యానర్ లో మరో సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది. అన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'మగధీర", 'ఆర్య2" తో మంచి గుర్తింపు పొందిన కథానాయిక కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వేతరన్ తమిళ హీరో ప్రభు ఓ ముఖ్య పాత్ర ప్రభాస్ కి తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో పీటర్ హెన్స్, ముఖేష్ రిషి, విలన్ పాత్రలు పోషిస్తున్నారు, ఇంకా దర్మవరపు సుబ్రమణ్యం, ఎయస్ నారాయణ మొ నటించనున్నారు


Click it and Unblock the Notifications











