‘రెబల్’ఫ్లాప్ టాక్ పై ప్రభాస్ తీవ్ర స్పందన
హైదరాబాద్ : ప్రబాస్ తాజా చిత్రం 'రెబల్'. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ ఆ విమర్శలను కొట్టిపారేసారు. ఆయన మాట్లాడుతూ...సినిమా రిలీజుకు ముందు 'గ్యారంటీగా హిట్ అవుతుంది' అని ఎవరూ ముందే చెప్పలేరు. అలా కరెక్ట్ రిపోర్ట్ చెప్పగల వ్యక్తి ఎవరైనా ఉంటే కోటి రూపాయిలిస్తా. అభిమానులు, ప్రేక్షకులు కొత్త రకం సినిమా కావాలంటారు. వారిని సంతృప్తిపరచడం కోసం మేం కూడా కొత్త రకం సినిమాలను ట్రై చేస్తుంటాం. 'రెబల్' అలా చేసిన సినిమాయే. ఇలా కొత్తదనం ట్రై చేసినప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి. అది తప్పదు. కానీ ఓవరాల్‌గా సినిమా బాగుంది కాబట్టి ఆ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరంలేదు అన్నారు.
ఇక కమెడియన్‌తో, అమ్మాయిలతో దెబ్బలు తిన్నానని అభిమానులు కొంతమంది ఫీలవుతున్నారు. కానీ ఆ సన్నివేశాలను ఎంజాయ్ చేస్తున్నవాళ్లు ఉన్నారు. ఈ సినిమాకి హైలైట్ ఇంటర్వెల్ బ్యాంగ్. అలాగే ఫైట్స్, డాన్సులు బాగా చేశానని అందరూ అంటున్నారు. యాక్షన్ సీన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైమ్ పట్టింది. అందుకే సినిమా నిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టింది అని చెప్పుకొచ్చారు.
'రెబల్'లో కథ లేదనే విషయం పై మాట్లాడుతూ...మామూలుగా మాస్ సినిమాలంటే కథ పెద్దగా ఉండదు. అఫ్‌కోర్స్ కొన్ని మాస్ సినిమాల్లో కథ బాగా కుదురుతుందనుకోండి. కానీ 'రెబల్' తరహా మాస్ మూవీలో కథకన్నా డాన్సులు, ఫైట్లు, కామెడీ, సెంటిమెంట్ వంటివి డామినేట్ చేస్తాయి. ఇలాంటి సినిమాల్లో వాటినే ఎక్స్‌పెక్ట్ చేయాలి. ఒక కమర్షియల్ సినిమాకి ఏమేం కావాలో అవన్నీ 'రెబల్'లో సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి అభిమానులు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. తదుపరి రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే మాస్ సినిమాలో మాత్రం కథ ఉంటుంది అన్నారు.
'రెబల్'రిలీజయ్యాక వచ్చిన రిపోర్టుల గురించి చెపుతూ...సినిమా గురించి నిజమైన రిపోర్ట్ చెప్పడానికి నేను నమ్మే స్నేహితులు, థియేటర్ అధినేతలు, పంపిణీదారులు, నిర్మాతలు.. ఇలా కొంతమంది ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్లందరూ బాగుందన్నారు. గత చిత్రాలకన్నా అందంగా ఉన్నావని అన్నారు. సినిమా చాలా స్టయిలిష్‌గా ఉందని కూడా అభినందించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ చూసి, థ్రిల్ అయ్యాం అని చెప్పారు. డాన్సులను ఎంజాయ్ చేశామన్నారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











