»   »  పార్టీ మూడ్లో ప్రభాస్....ఇపుడు ఎక్కడ?

పార్టీ మూడ్లో ప్రభాస్....ఇపుడు ఎక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా కోసం గత రెండు మూడేళ్లుగా ప్రభాస్ పడిన కష్టం మాటల్లో చెప్పడం కష్టమే. సినిమా కోసం కఠినమైన ఆహార నియమాలు, కఠినమైన వ్యాయామం, కత్తి యుద్ధం, కొండలు ఎక్కడం లాంటి విషయాల్లో అత్యంత కఠినతరమైన శిక్షణ. మొత్తానికి ‘బాహుబలి' సినిమా కోసం ప్రభాస్ పడిన కష్టానికి తగిన ఫలితమే దక్కింది. సినిమా సూపర్ హిట్టయింది. బాక్సాఫీసు వద్ద వందల కోట్లు కొల్లగొడుతోంది.

త్వరలో మళ్లీ ‘బాహుబలి' పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ఈ గ్యాపులో కాస్త రిలాక్స్ అవ్వాలని నిర్ణయించుకున్న ప్రభాస్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే స్కూల్ ప్రెండ్స్, కాలేజీ స్నేహితులతో కలిసి యూరఫ్ ట్రిప్ ప్లాన్ చేసారు. అంతా కలిసి కొన్ని రోజుల పాటు యూరఫ్‌లో ఎంజాయ్ చేసేందుకు బయల్దేరి వెళ్లారు.

‘బాహుబలి-ది బిగినింగ్' సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. హీరో ప్రభాస్‌కు ఇంటర్నేషనల్ రేంజిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. కొడుకు సినిమా ఇంత భారీ విజయం సాధించడంపై ప్రభాస్ తల్లి శివ కుమారి చాలా ఆనందంగా ఉంది. అయితే ‘బాహుబలి 2' విషయంలో మాత్రం కొంత ఆందోళన చెందుతోందట.

 Prabhas flying to Europe

‘బాహుబలి' పార్ట్ 1 కోసం ప్రభాస్ చాలా సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యే పార్ట్ 2 విషయంలో కూడా దాదాపు సంవత్సరం కాలం పట్టడం ఖాయం. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు ఎక్కువ రోజులు సమయం తీసుకోవద్దని సూచించిందట. ఆమె ఆందోళన అంతా ప్రభాస్ పెళ్లి గురించే. బాహుబలి 2 ఎంత లేటయితే ప్రభాస్ పెళ్లి కూడా అంతే ఆలస్యం అవుతుందని ఆమె ఆందోళన చెందుతోంది.

ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్‌గా పేరు తెచ్చుకున్న ‘బాహుబలి-ది బిగినింగ్' గత శుక్రవారం విడుదలైన బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. టాలీవుడ్లో అన్ని రికార్డులను తుడిచి పెట్టడంతో పాటు బాలీవుడ్లోనూ పలు రికార్డులను బద్దలు కొట్టింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి' హిందీ వెర్షన్ శుక్రవారం రూ. 3.25 కోట్లు వసూలు చేసింది. దీంతో హిందీ వెర్షన్ కలెక్షన్ రూ. 50 కోట్ల మైలురాయిని అందుకున్నట్లయింది. బాహుబలి హిందీ వెర్షన్ కలెక్షన్లు టోటల్ 10 కోట్ల అంచనాతో విడుదల చేస్తే ఏకంగా 50 కోట్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మరో వైపు ఈ చిత్రం కర్ణాటకలో ఏకంగా రూ. 20 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

English summary
Prabhas is heading to Europe along with five of his friends from school and college days. Prabhas says that this short break will rejuvenate him for Baahubali 2.
Please Wait while comments are loading...