చిన్నారి అభిమాని కోరిక తీర్చిన హీరో ప్రభాస్ (ఫోటోస్)
Recommended Video

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన చిన్నారి అభిమాని మదన్ కోరిక తీర్చాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మదన్ అనే బాలుడు బాహుబలిలో తన ఫేవరెట్ క్యారెక్టరైన ప్రభాస్‌ను కలవాలని ఆశపడ్డాడు. సోషల్ మీడియా ద్వారా మదన్ చేసిన రిక్వెస్ట్‌పై యంగ్ రెబల్ స్టార్ వెంటనే స్పందించారు. ఆ చిన్నారి కోరికను తీర్చి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అభిమానితో ప్రభాస్
చిన్నారి అభిమానితో కలిసిన ప్రభాస్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా బాహుబలి స్టార్ బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సోషల్ మీడియా ద్వారా
ఐ వాంట్ టు మీట్ ప్రభాస్ అంటూ సోషల్ మీడియా ద్వారా సదరు బాలుడు చేసిన రిక్వెస్ట్‌ను ఫ్యాన్స్ యంగ్ రెబల్ స్టార్ దృష్టికి తీసుకెళ్లారు.

సాహో షూటింగులో బిజీ బిజీ
ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగులో భాగంగా హైదరాబాద్‌లో ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ రొమేనియాలో ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్లే ముందు ప్రభాస్ తన అభిమానిని కలవాలని నిర్ణయించుకున్నారు.

శరవేగంగా షూటింగ్
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో' చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్. జాకీష్రాఫ్, ఎవలీన్ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2019లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











