దుబాయ్‌లో ‘సాహో’ భారీ యాక్షన్ సీక్వెన్స్: ప్రభాస్ ఫోటోస్ వైరల్

By Bojja Kumar

బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం 'సాహో'. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు హై రేంజిలో ఉన్నాయి. ప్రసుత్తం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అబుదాబి, దుబాయ్‌లో జరుగుతోంది. ప్రభాస్ మీద చిత్రీకరిస్తున్న సీన్లకు సంబంధించిన ఫోటోస్ లీక్ అయ్యాయి. కొన్ని క్షణాల్లోనే ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

హై ఆక్టేన్ బైక్ స్టంట్స్

హై ఆక్టేన్ బైక్ స్టంట్స్

ప్రభాస్ మీద హై ఆక్టేన్ బైక్ స్టంట్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.

 శ్రద్ధా కపూర్, ఎవలీన్ శర్మ కూడా

శ్రద్ధా కపూర్, ఎవలీన్ శర్మ కూడా

ప్రభాస్‌తో పాటు హీరోయిన్ శ్రద్ధా కపూర్, ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఎవలీన్ శర్మపై కూడా యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు వచ్చిన యాక్షన్ మూవీల్లో ది బెస్ట్ యాక్షన్ చిత్రంగా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు.

ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సీన్లు

ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా ఉంటుంద‌ని, అందుకోసం ఏకంగా 40 కోట్ల భారీ బ‌డ్జెట్‌ని ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. సుమారు 20 నిమిషాల పాటు ఒళ్లు గగుర్బొడిచే సీక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. బైక్‌లు, కార్లు, ట్రక్కులతో ఆ ఛేజింగ్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం.

సాహో బైక్ ఇపుడు యూత్ ఫేవరెట్

సాహో బైక్ ఇపుడు యూత్ ఫేవరెట్

సాహో బైక్ ఇపుడు యూత్ ఫేవరెట్ బైక్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఈ బైక్ మీద తమ ఇష్టాన్ని వెల్లడిస్తూ పలువురు అభిమానులు రకరకాల పోస్టులు చేస్తున్నారు.

భారీ బడ్జెట్ మూవీ

భారీ బడ్జెట్ మూవీ

‘సాహో' చిత్రాన్ని హాలీవుడ్ రేంజిలో తెరకెక్కిస్తున్నారు. ఇందు కోసం యూవి క్రియేషన్స్ వారు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. తొలుత ఈ చిత్రం రూ.150 కోట్ల బడ్జెట్ అని చెప్పినప్పటికీ సినిమా పూర్తయ్యే వరకు ఖర్చు రూ. 200 కోటు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

సాబు సిరిల్ ఆధ్వర్యంలో భారీ సెట్స్

సాబు సిరిల్ ఆధ్వర్యంలో భారీ సెట్స్

అబుదాబిలో యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన సెట్స్ వేయడం కోసం 300 మంది టీంతో ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ అబుదాబి వెళ్లారు. సెట్స్ వేయడానికి కావాల్సిన సామాగ్రిని 4 కంటైనర్లలో షిప్స్ ద్వారా ఇండియా నుండి అబుదాబి తరలించారు.

కనీ వినీ ఎరుగని రీతిలో రిలీజ్

కనీ వినీ ఎరుగని రీతిలో రిలీజ్

బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారీ విజయం సాధించడంతో ప్రభాస్‌కు బాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతడు నటిస్తున్న తాజా చిత్రం 'సాహో' చిత్రానికి ఫుల్ డిమాండ్ ఉండటంతో బాలీవుడ్ బడా సినీ నిర్మాణ సంస్థ టి సిరీస్ ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. ఈ మేరకు యూవి క్రియేషన్స్ వారితో టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 'సాహో' చిత్రం టీ సిరీస్ చేతికి చిక్కడంతో ఈ చిత్రం హిందీ రిలీజ్ కనీవినీ ఎరుగని స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు.

భారీ తారాగణం

భారీ తారాగణం

సాహో చిత్రాన్ని దక్షిణాది మార్కెట్‌తో బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అందుకే హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, విలన్‌గా నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ను ఎంపిక చేశారు. వీరితో పాటు కీ ష్రాఫ్‌, మందిరా బేడీ, చుంకీ పాండేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

2019లో సాహో

2019లో సాహో

‘సాహో' మూవీ 2019లో విడుదల కానుంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.... పలు కారణాలతో షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదలను వచ్చే ఏడాది వాయిదా వేయక తప్పలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X