»   » ప్రభాస్ కోసం సీరియస్‌గా పెళ్లి ఏర్పాట్లు..!

ప్రభాస్ కోసం సీరియస్‌గా పెళ్లి ఏర్పాట్లు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు గత కొంతకాలంగా సీరియస్‌గా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ సంవత్సరాంతంలోగా ప్రభాస్ పెళ్లి చేయాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన ప్రభాస్ వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు.

ఫోకస్ అంతా సినిమా కెరీర్ మీద పెట్టి జీవితానికి సంబంధించిన అతిముఖ్యమైన ఘట్టాన్ని ప్రభాస్ వాయిదా వేస్తుండటంపై అభిమానుల్లోనూ అసంతృప్తి నెలకొంది. అయితే ఎట్టకేలకు ఈ సంవత్సరం ప్రభాస్ ఓ ఇంటి వాడు అవుతున్నాడనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.

Prabhas to get married in December

ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు గతకొంత కాలంగా ప్రభాస్ పెళ్ళికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . ఐతే ఎప్పటికప్పుడు ఆ పెళ్లి పనులు వాయిదా పడుతున్నప్పటికీ ఎట్టకేలకు బాహుబలి కూడా పూర్తి కావడంతో ఈ డిసెంబర్ లో పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకున్నారట. ప్రభాస్ పెళ్లాడబయే అమ్మాయి ఎవరు? అనేది త్వరలో వెల్లడి కానుంది.

English summary
Prabhas is going to get married by the year end i.e. in December. Earlier there was news that Prabhas will marry a Bhimavaram girl after the completion of Baahubali. Now, the time has come and Prabhas is planning to get married this year.
Please Wait while comments are loading...