twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెన్యా గవర్నమెంట్ నుంచి ప్రభాస్ కు లెటర్, ఏముంది అందులో

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రభాస్ కి కెన్యా ప్రభుత్వం ఎప్రిషియేషన్ లెటర్ ని పంపింది. ఆయన రీసెంట్ గా ఆ దేశాన్ని సందర్బించటంతో అక్కడి గవర్నర్ ఈ లెటర్ పంపటం జరిగింది. ఈ లెటర్ ని మీరు ఈ క్రింద చూడవచ్చు. బాహుబలి చిత్రం షూటింగ్ కు వేసవి శెలవలు ప్రకటించటంతో తన స్నేహితులతో కలిసి ప్రభాస్ కెన్యా వెళ్లారు. ఆయన అక్కడ రెండు వారాలు ఉన్నారు.

    అక్కడ నేషనల్ రిజర్వ్ అయిన Maasai Mara కి వెళ్లటం జరిగింది. Maasai Mara ఆఫ్రికాలో అతి పెద్ద వైల్డ్ లైఫ్ రిజర్వ్. చాలా అద్బుతమైన ప్రాంతం. ట్రావలెర్స్ ఎక్కువగా దీన్ని సందర్శిస్తూంటారు. సింహాలు, చిరుతపులలు వంటి వైల్డ్ జంతువులకు ప్రసిద్ది. ప్రభాస్ అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసారని సమాచారం.

    Prabhas gets an appreciation letter from Kenyan government

    ప్రభాస్ అక్కడికి వచ్చి వెళ్లారనే విషయం తెలుసుకున్న అక్కడి గవర్నమెంట్...ఆయనకు ఎప్రిషియేషన్ లెటర్ రాసింది. ఈ లెటర్ లో మరో సారి ఈ ప్రాంతానికి రమ్మనమని,షూటింగ్ లు కూడా చేసుకోవచ్చుని, పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పుకొచ్చింది.

    'బాహుబలి-2'కి సమ్మర్ ఎఫెక్ట్ తీవ్రంగా సోకింది. మండే ఎండల కారణంగా రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌కు సుమారు నెలరోజులపాటు బ్రేక్ ఇవ్వాలని ఇటీవలే మేకర్స్ నిర్ణయించారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ బ్రేక్‌ను మొత్తం 45 రోజులకు పెంచినట్టు తెలుస్తోంది. మే నెల 1 నుంచి జూన్ 15 వరకు యూనిట్ షూటింగ్ నిలిపివేస్తుందని దర్శకుడు రాజమౌళి, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ప్రకటించారు.

    Prabhas gets an appreciation letter from Kenyan government

    బ్రేక్ ఇచ్చిన సమయంలో రాజమౌళి తన ఫ్యామిలీతో ఆస్ట్రేలియా వెళ్తాడని, హీరో ప్రభాస్ యూఎస్‌కు,ఆఫ్రికా, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ కూడా ఫారిన్ ట్రిప్ పెట్టుకున్నారని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 45 డిగ్రీల సెల్సియస్‌కు టెంపరేచర్ చేరుకోవడంతో ఇక 'బాహుబలి-2' యూనిట్‌కు రెస్ట్ ఇవ్వక తప్పింది కాదు. ఏది ఏమైనా 2017 ఏప్రిల్ 14న మూవీ రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి మేకర్స్ కట్టుబడి ఉన్నారు.

    English summary
    Prabhas gets an appreciation letter from Kenyan government for his recent visit to the country’s renowned and largest county reserve, Maasai Mara.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X