»   »  మనమే ఫూల్స్..... ప్రభాస్‌కు 65 కోట్ల ‘బాహుబలి’ షేర్!

మనమే ఫూల్స్..... ప్రభాస్‌కు 65 కోట్ల ‘బాహుబలి’ షేర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా కోసం ప్రభాస్ 2 సంవత్సరాల సమయం కేటాయించి మిస్టేక్ చేసాడని, ఈ గ్యాప్ లో ఆయన చాలా సినిమాలు చేసి ఉండే వాడు, చాలా సంపాదన కోల్పోయాడు అనే వాదన అప్పట్లో వినపడింది. అయితే ‘బాహుబలి' సినిమా విడుదలైన తర్వాత ఆ వాదన తేలి పోయింది.

తాజాగా రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికర విషయం బయట పెట్టారు. ‘బాహుబలి' సినిమా కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా రెండేళ్ల సమయం కేటాయించాడు అని మనమంతా తెలివితక్కువ ఆలోచన చేసాం. కానీ ప్రభాస్ ‘బాహుబలి' పార్ట్ 1 ద్వారా వచ్చే లాభాల్లో రూ. 65 కోట్ల షేర్ తీసుకుంటున్నాడు అని వెల్లడించారు.

Prabhas getting 65 cr share

కేవలం రెండు సంవత్సరాల్లో ప్రభాస్ భారీ విజయం తన ఖాతాలో వేసుకోవడంతో పాటు 65 కోట్లు సంపాదించాడు. దీనికి తోడు అంతర్జాతీయ గుర్తింపు అదనం. ఇతర హీరోలెవరికీ ఈ రేంజిలో దక్కలేదు అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసాడు. బాహుబలి సింహం అయితే దాని కలెక్షన్స్ అడవి అంత పెద్దవి. మున్ముందు రాబోయే పెద్ద హీరోల సినిమాలన్నీ వీధుల్లో తిరిగే కుక్కల్లా కనిపిస్తున్నాయి అంటూ వర్మ ట్వీట్ చేసాడు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన బాహుబలి రెండు భాగాలు కలిపి రూ. 250 కోట్లతో తెరకెక్కింది. ప్రస్తుతం విడుదలైన తొలి భాగా ‘బాహుబలి-ది బిగినింగ్' అంచనాలకు మించిన వసూళ్లు సాధిస్తోంది. రెండో భాగం 2016లో విడుదల కాబోతోంది.

English summary
"All us fools thought Prabhas did mistake gvng 2 yrs time without taking money nd now he's getting 65 cr share frm profits of just part 1" Ram Gopal Varma tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu