అనుష్కకు ప్రభాస్ దిమ్మతిరిగే గిఫ్ట్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
Recommended Video

తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో ఆకట్టుకొనే టాప్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. గతంలో అరుంధతి, బాహుబలి లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనుష్క.. మిర్చి, బిల్లా లాంటి చిత్రాల్లో గ్లామర్‌తో ఆకట్టుకున్నది. అలా దూసుకుపోతున్న అనుష్క నవంబర్ 7న తన జన్మదినాన్ని జరుపుకున్నది. తనకు అత్యంత ఇష్టమైన అనుష్కకు ఖరీదైన బహుమతిని ప్రభాస్ ఇచ్చాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రభాస్, అనుష్క అఫైర్
ప్రభాస్, అనుష్క జోడి తెరపైన క్రేజ్‌గా మారింది. వారి మధ్య అఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలు వచ్చాయి. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమర్ సంధూ తన ట్విట్టర్‌లో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ చేసిన ట్వీట్ ఇటీవల సంచలనంగా మారి కూర్చున్నది. అయితే ఆ వార్తపై అటూ అనుష్క గానీ, ప్రభాస్ గానీ సీరియస్‌గా తీసుకొన్నట్టు కనిపించలేదు.

ప్రభాస్ అంటే ఇష్టమైన వ్యక్తి
ఆ తర్వాత ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో అనుష్క తెలిపిన బర్త్ డే శుభాకాంక్షలు అందరిని ఆకట్టుకొన్నాయి. నేను ఎక్కువగా ఇష్టపడే, ప్రేమించే అద్భుతమైన వ్యక్తి ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. సుఖసంతోషాలు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకొంటున్నాను అని అనుష్క ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రభాస్‌కు అనుష్క వాచీ గిఫ్ట్
అంతేకాకుండా ప్రభాస్‌కు పుట్టిన రోజున అనుష్క మంచి గిఫ్ట్ కూడా అందించింది. ప్రభాస్ అంటే తాను ఎంతగా ఇష్టపడుతానో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రభాస్‌కు అనుష్క వాచ్ గిఫ్ట్ గా ఇచ్చింది. విషయం జాతీయ స్థాయి మీడియాలో ప్రముఖ వార్తగా నిలిచింది.

ప్రభాస్‌కు దూరమైన అనుష్క
బాహుబలి తర్వాత సాహోలో ప్రభాస్ పక్కన నటిస్తున్నారనే వార్త తొలుత వచ్చింది. కానీ అయితే కొన్ని కారణాల వల్ల అనుష్కను తప్పించి శ్రద్ధాకపూర్‌ను తీసుకొన్నారు. ఆ విధంగా తెరపైన ప్రభాస్‌కు దూరమైంది. కానీ వారిద్దరి మధ్యలో స్నేహం అలానే కొనసాగుతున్నదనేది అందరికీ తెలిసిందే.
అనుష్కకు ప్రభాస్ ట్వీట్
అనుష్క జన్మదినాన్ని పురస్కరించుకొని విడుదలైన భాగమతి చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ గురించి కామెంట్ చేస్తూనే.. జేజమ్మకు ప్రభాస్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనుష్క శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా విడుదలైన భాగమతి పోస్టర్ ఇదే అంటూ ప్రభాస్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశాడు.

బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్
ఇప్పుడు అనుష్క జన్మదినం జరుపుకొన్న నేపథ్యంలో ప్రభాస్ కూడా తన ఇష్టమైన హీరోయిన్ అనుష్కకు భారీ గిఫ్ట్‌ను ఇచ్చినట్టు సమాచారం. ప్రభాస్ ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును అనుష్క బర్త్ డే గిఫ్ట్‌గా ఇచ్చాడని సినిమా వర్గాల్లో చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











