twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుమంత్ అశ్విన్ పెళ్లి.. ప్రభాస్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. బయటపెట్టిన ఎంఎస్ రాజు

    |

    ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ వివాహాం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రైవేట్‌గా జరిగిన ఈ వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీ నుండి ఇంచుమించుగా పదిమందిని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కేరింత సినిమాలో సుమంత్ అశ్విన్‌తో కలిసి నటించిన తేజస్వి మడివాడ పెళ్లిలో పాల్గొని సందడి చేసింది. అయితే ఈ పెళ్లికి వెళ్లలేకపోయిన కొంత మంది స్టార్స్ మాత్రం వ్యక్తిగతంగా విషెస్ తెలిపినట్టు తెలుస్తోంది.

    ప్రేమ వివాహాం..

    ప్రేమ వివాహాం..

    సుమంత్ అశ్విన్, దీపికా రాజు గత కొద్దికాలంగా ప్రేమించుకొంటూ ఉన్నారు. వారి ప్రేమకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలియజేయడంతో మ్యారేజ్‌కు లైన్ క్లియర్ అయింది. దాంతో వారి పెళ్లిని ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి నిర్వహించారు. అయితే ఈ వేడుకను మాత్రం అత్యంత సమీప బంధువుల సమక్షంలోనే జరిపించారు.

    సోషల్ మీడియాలో అలా..

    సోషల్ మీడియాలో అలా..

    అయితే సోషల్ మీడియా ద్వారా సుమంత్‌కు విషెస్ అందజేశారు చాలా మంది. అలా సుమంత్ పెళ్లి సందర్భంగా విషె చేసిన ప్రతీ ఒక్కరికీ ఎంఎస్ రాజు స్పెషల్‌గా రిప్లై ఇచ్చుకుంటూ వచ్చాడు. విషెస్ చెబుతూ ఆశీర్వాదం, ప్రేమను కురిపిస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్లు చేశాడు.

    తాజాగా అలా...

    తాజాగా అలా...

    అయితే తాజాగా డార్లింగ్ ప్రభాస్ ఓ స్పెషల్ సర్ ప్రైజ్ గిఫ్ట్ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎంఎస్ రాజు ఆ గిఫ్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్రభాస్ అందించిన విషెస్‌తో పాటు బొకే, నూతన వదువుకు చీరను గిఫ్ట్‌గా పంపినట్టు కనిపిస్తోంది.

    ఎంఎస్ రాజు ట్వీట్..

    ఎంఎస్ రాజు ట్వీట్..

    నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభాస్ బొకేతో పాటు కానుకలు పంపాడు. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సుమంత్.. ఫ్రమ్ ప్రభాస్ అంటూ డార్లింగ్ కొత్త జంటను విష్ చేశారు. ఈ విషయాన్ని ఎంఎస్ రాజు సోషల్ మీడియాలో తెలియజేశాడు.

    ప్రభాస్ ఎంఎస్ రాజు అలా..

    ప్రభాస్ ఎంఎస్ రాజు అలా..

    ప్రభాస్‌కు కెరీర్ పరంగా బ్రేక్ ఇచ్చిన వర్షం సినిమాను ఎంఎస్ రాజు నిర్మించాడు. ఆ తరువాత మళ్లీ పౌర్ణమి సినిమాను కూడా ఎంఎస్ రాజు నిర్మించాడు. ఈ రెండూ కూడా ప్రభాస్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలే కావడం విశేషం.

    English summary
    Prabhas Gift To MS Raju Son sumanth Ashwin Marriage
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X