Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సుమంత్ అశ్విన్ పెళ్లి.. ప్రభాస్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. బయటపెట్టిన ఎంఎస్ రాజు
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ వివాహాం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రైవేట్‌గా జరిగిన ఈ వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీ నుండి ఇంచుమించుగా పదిమందిని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కేరింత సినిమాలో సుమంత్ అశ్విన్‌తో కలిసి నటించిన తేజస్వి మడివాడ పెళ్లిలో పాల్గొని సందడి చేసింది. అయితే ఈ పెళ్లికి వెళ్లలేకపోయిన కొంత మంది స్టార్స్ మాత్రం వ్యక్తిగతంగా విషెస్ తెలిపినట్టు తెలుస్తోంది.
ప్రేమ వివాహాం..
సుమంత్ అశ్విన్, దీపికా రాజు గత కొద్దికాలంగా ప్రేమించుకొంటూ ఉన్నారు. వారి ప్రేమకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలియజేయడంతో మ్యారేజ్‌కు లైన్ క్లియర్ అయింది. దాంతో వారి పెళ్లిని ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి నిర్వహించారు. అయితే ఈ వేడుకను మాత్రం అత్యంత సమీప బంధువుల సమక్షంలోనే జరిపించారు.
సోషల్ మీడియాలో అలా..
అయితే సోషల్ మీడియా ద్వారా సుమంత్‌కు విషెస్ అందజేశారు చాలా మంది. అలా సుమంత్ పెళ్లి సందర్భంగా విషె చేసిన ప్రతీ ఒక్కరికీ ఎంఎస్ రాజు స్పెషల్‌గా రిప్లై ఇచ్చుకుంటూ వచ్చాడు. విషెస్ చెబుతూ ఆశీర్వాదం, ప్రేమను కురిపిస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్లు చేశాడు.
తాజాగా అలా...
అయితే తాజాగా డార్లింగ్ ప్రభాస్ ఓ స్పెషల్ సర్ ప్రైజ్ గిఫ్ట్ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎంఎస్ రాజు ఆ గిఫ్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్రభాస్ అందించిన విషెస్‌తో పాటు బొకే, నూతన వదువుకు చీరను గిఫ్ట్‌గా పంపినట్టు కనిపిస్తోంది.
ఎంఎస్ రాజు ట్వీట్..
నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభాస్ బొకేతో పాటు కానుకలు పంపాడు. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సుమంత్.. ఫ్రమ్ ప్రభాస్ అంటూ డార్లింగ్ కొత్త జంటను విష్ చేశారు. ఈ విషయాన్ని ఎంఎస్ రాజు సోషల్ మీడియాలో తెలియజేశాడు.
ప్రభాస్ ఎంఎస్ రాజు అలా..
ప్రభాస్‌కు కెరీర్ పరంగా బ్రేక్ ఇచ్చిన వర్షం సినిమాను ఎంఎస్ రాజు నిర్మించాడు. ఆ తరువాత మళ్లీ పౌర్ణమి సినిమాను కూడా ఎంఎస్ రాజు నిర్మించాడు. ఈ రెండూ కూడా ప్రభాస్ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాలే కావడం విశేషం.