Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
అభిమానులకు మాత్రం 'లైట్ తీస్కో': ప్రభాస్
'నా కెరీర్ లో విడుదలైన మొదటిరోజు మొదటి షో కే సూపర్ హిట్ టాక్ రావడం 'మిస్టర్ పర్ఫెక్ట్' ద్వారానే చూసాను. ఏడాది పాటు ఎంతో కస్టపడి మా యూనిట్ ఈ సినిమాను రూపొందించారు. సంవత్సరం పాటు ఒకే తరహా ఫిజిక్ ను మైన్ టైన్ చెయ్యటానికి నేనెంతో కష్టపడాల్సి వచ్చింది అంటూ ప్రభాస్ తన తాజా చిత్రం మిస్టర్ ఫర్ ఫెక్ట్ గురించి చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ప్రమేషన్ లో భాగంగా విజయయాత్ర జరుపుతూ ఇలా స్పందించారు. అలాగే డార్లింగ్ ఫ్యామిలీ చిత్రమయినా, యాక్షన్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రం నా ఇమేజ్ ను కలిపి సరికొత్త తరహాలో రూపొందించిన కుటుంబ కధా చిత్రం. క్లైమ్యక్స్ లో నా నటనను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో, లేదో అన్న సందేహం వుండేది.
కాని మంచి సినిమాలకు, స్క్రిప్ట్ కు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని ఆడియన్స్ మరోసారి నిరూపించారు. నాకు, కాజల్ కు మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకుల రెస్పాన్స్ బాగాగుంది. తాప్సి నటన సూపర్బ్. దశరధ్ గారు ప్రతి సీన్ ను ఫ్రెష్ గా తీసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, విజయ్ చక్రవర్తి ఫోటోగ్రఫి ఎంతో కలిసి వచ్చాయి. నాకు వినడానికి 'డొల్ డొల్' పాట నచ్చింది. చూడ్డానికి మాత్రం 'ఆకాశం బద్దలయినా' పాట బాగుంది. అభిమానులకు మాత్రం 'లైట్ తీస్కో' పాట బాగా ఎక్కేసింది. బ్రహ్మానందం, రఘుబాబు గారు చేసిన కామెడి కూడా ఆడియన్స్ కు బాగా నచ్చింది. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు' అన్నారు.