ప్రభాస్‌కు మళ్ళీ తిప్పలు.. వాడేసుకుంటున్నారు, రొమాంటిక్ సినిమా కోసం!
Recommended Video

బాహుబలి చిత్రం నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తిప్పలు తప్పడం లేదు. బాహుబలి, బాహుబలి 2 కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. ఆ తరువాత కూడా ప్రశాంతంగా చేసుకునే చిత్రాలకు కాకుండా భారీ చిత్రాలకే ఒకే చెబుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్లుగానే దర్శకులు ప్రభాస్ ని బాగా వాడేసుకుంటున్నారు. సాహో చిత్రం సెట్స్ పై ఉండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది.

బాహుబలి కోసం 130 కేజీలు
ప్రభాస్ బాహుబలి చిత్రం కోసం చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు. ఆ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ దాదాపుగా 130 కేజీల బరువు పెరిగాడు. బాహుబలి రెండు భాగాల కోసం అదే ఫిజిక్ మైంటైన్ చేసాడు. బాహుబలి షూటింగ్ ముగియగానే తక్కువ సమయంలోనే స్లిమ్ గా మారి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి తరువాత సుజిత్ దర్శత్వంలో సాహో చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

200 కోట్ల బడ్జెట్‌తో
సాహో చిత్రం దాదాపు 200 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కూడా ప్రభాస్ భారీ కాయంతో కనిపించాలి. బాహుబలి స్థాయిలో కాకున్నా ఈ చిత్రం కోసం కూడా ప్రభాస్ కొంత బరువు పెరిగాడు. ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

రొమాంటిక్ చిత్రం
సాహూ షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించేశాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. 1960 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో రాధాకృష్ణ రొమాంటిక్ ప్రేమ కథని సిద్ధం చేయరట.ఈ చిత్రంలో ప్రబస్ స్లిమ్ గా కనిపించాల్సి ఉంటుంది. దీనితో దర్శకుడు ప్రభాస్ ని బరువు తగ్గమని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రభాస్ డైటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఒక్క చిత్రం కూడా
బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి ఒక్క చిత్రం కూడా రాలేదు.సాహో 2019 లో విడుదల కానున్న నేపథ్యంలో 2018 ప్రభాస్ క్యాలెండర్ లో ఖాళీగా మారనుంది. షూటింగ్ వేగంగా జరిగితే రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూడా 2019లోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం యూరప్ లో చిత్రీకరించాల్సి ఉంటుందట.


Click it and Unblock the Notifications











