సందీప్ కిషన్ సినిమాకు తొలి టికెట్ కొన్న ప్రభాస్
వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు సందీప్ కిషన్. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న అతడు ఏకంగా నిర్మాణ సంస్థనే స్థాపించాడు. తన సొంత బ్యానర్‌లోనే సినిమా చేశాడు. అదే 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను కార్తీక్ రాజు తెరకెక్కించాడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వీ స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా జూలై 12న విడుదల కానుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు యువ హీరోలు నిఖిల్, సుధీర్ బాబు ముఖ్య అతిథులుగా, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ, 'ఫలక్‌నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు. వీళ్లకు సినిమా సెకండ్ టికెట్‌ను సందీప్ కిషన్ అందజేశారు. సెంటిమెంట్‌గా ఫస్ట్ టికెట్ ఎవరికి ఇస్తామనేది గురువారం చెబుతామని సందీప్ తెలిపారు.

ఫంక్షన్‌లో చెప్పినట్లుగానే 'నిను వీడని నీడను నేనే' మొదటి టికెట్‌ను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు అమ్మాడు. దీనిని ప్రభాస్ రూ. 1116కు కొనుగోలు చేశాడు. అంతేకాదు, ఈ చిత్ర యూనిట్‌తో అతడు చాలా సమయం గడిపాడు. ఆ సందర్భంలోనే చిత్ర ట్రైలర్‌ను ప్రభాస్‌కు చూపించాడు సందీప్ కిషన్. ఇది చూసిన వెంటనే సినిమా చూడాలన్న ఆసక్తి పెరిగిపోయిందన్న యంగ్ రెబెల్ స్టార్.. సందీప్ కిషన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
ప్రభాస్ సపోర్ట్ చేయడం ద్వారా ఈ సినిమాను ఆయన అభిమానులు ఆదరిస్తారని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ప్రభాస్ తమ కోసం చాలా సమయం కేటాయించడంతో పాటు తమ టీమ్‌కు విషెస్ చెప్పడం పట్ల 'నిను వీడని నీడను నేనే' యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, తమకు ఈ అవకాశం కల్పించిన ప్రభాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.


Click it and Unblock the Notifications











