ప్రభాస్ ప్రేమలో పడింది ఈమెతోనే.. ఆమె అంటే నాకు ఇష్టం.. యంగ్ రెబల్‌స్టార్

By Rajababu

Recommended Video

ప్రభాస్ ప్రేమలో పడింది ఈమెతోనే..!

బాహుబలి2 చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా ప్రజాదరణను మూటగట్టుకొన్నారు. బాహుబలి తర్వాత అమ్మాయిలే కాదు.. అన్ని రంగాలకు చెందిన హీరోయిన్లు ఫిదా అయిపోయారు. ప్రభాస్ అంటే పడిచచ్చేంత స్థాయికి వారి అభిమానం పెరిగింది. అలాంటి ప్రభాస్‌ ఓ బాలీవుడ్ నటి ప్రేమలో పడ్డారట. ఆ విషయాన్ని ఇటీవల ఏకంగా ఆమె భర్త తో చెప్పడం ఈ వ్యవహారంలో కొసమెరుపు.

 రవీనా అంటే ఇష్టమట..

రవీనా అంటే ఇష్టమట..

ఇంతకీ ప్రభాస్ మనుసు దోచుకొన్న బాలీవుడ్ నటి ఎవరంటే.. తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ అంటూ యువకుల హృదయాలను కొల్లగొట్టిన రవీనా టాండన్. ఇటీవల ప్రభాస్‌తోపాటు బాహుబలి టీమ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.

 బాహుబలి డిస్ట్రిబ్యూషన్

బాహుబలి డిస్ట్రిబ్యూషన్

ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రాలను ఉత్తరాదిలో రవీనా టాండన్ భర్త అనిల్ తండానీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ తర్వాత అనిల్, ప్రభాస్ మంచి స్నేహితులయ్యారు. అనిల్ హైదరాబాద్‌కు వచ్చినా.. ప్రభాస్ ముంబైకి వెళ్లినా ఇద్దరు కలుసుకొంటారు.

 రానా బయటపెట్టిన విషయం

రానా బయటపెట్టిన విషయం

అయితే అనిల్‌ను ఓ సమయంలో రానా దగ్గుబాటి కలిసినప్పుడు.. రవీనా అంటే ప్రభాస్‌కు ఎంత ఇష్టం అనే విషయాన్ని వెల్లడించారట. దాంతో రవీనాను ప్రభాస్‌తో కలిపించేందుకు అనిల్ ఏర్పాట్లు చేశారట.

ప్రభాస్ డిన్నర్‌కు రవీనా

ప్రభాస్ డిన్నర్‌కు రవీనా

ఆ క్రమంలోనే హైదరాబాద్‌లో డిన్నర్ ఏర్పాటు చేసి రవీనాను ప్రభాస్, రానా దగ్గుబాటి ఆహ్వానించారు. ఈ డిన్నర్ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు.

 రవీనా పాట అంటే ఇష్టం

రవీనా పాట అంటే ఇష్టం

రవీనా టాండన్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అందాజ్ అప్నా అప్నా చిత్రంలో ఎలో జి సనమ్ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు అని ఇటీవల ప్రభాస్ మీడియాకు తెలిపారు.

 సాహో షూటింగ్‌లో

సాహో షూటింగ్‌లో

బాహుబలి చిత్రం తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సాహో చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్, పలువురు హిందీ నటులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X