ప్రభాస్ ఇపుడు డబుల్ మిలియనీర్...(ఫోటోలు)
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తొలి మూడు నెలల్లోనే ఫేస్‌బుక్‌లో ప్రభాస్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 1 మిలియన్ మార్కను దాటేసింది. తాజాగా ఇది రెండు మిలియన్లకు చేరింది. ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి'చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు ఉండనున్నాయి.

బాహుబలి షూటింగులో..
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

రానాతో కలిసి..
బాహుబలి చిత్రంలో రానా, ప్రభాస్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సినిమా మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. రానా ఇందులో నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు.

అదరిపోయే స్టైల్..
ప్రభాస్‌ను ఫాలో అయ్యే వారిలో యూతే అధికం. ఆయన స్టైల్‌ను ఫాలో అయ్యే అభిమానులు బోలెడు.

ఫ్యామిలీతో...
ఫ్యామిలీతో కలిసి ప్రభాస్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











