twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas: నా కల ఇన్నాళ్లకు నెరవేరింది.. ఆ స్టార్ హీరో ఫోటో పోస్ట్ చేస్తూ డార్లింగ్ హార్ట్ టచింగ్ పోస్ట్

    |

    టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా రెబల్ స్టార్ చాలా వేగంగా సినిమాలను పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నాడు. ప్రభాస్ పై ప్రస్తుతం నిర్మాతలు ఏ స్థాయిలో బడ్జెట్ పెట్టడానికైనా సరే సిద్ధంగా ఉంటున్నారు. అయితే రీసెంట్ గా ప్రభాస్ సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరో ఫొటో పోస్ట్ చేస్తూ నా కల నెరవేరింది అని హార్ట్ టచింగ్ గా పోస్ట్ పెట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

     అన్ని తరహా సినిమాలతో..

    అన్ని తరహా సినిమాలతో..

    ఇక బాహుబలి సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకున్న ప్రభాస్ అదే తరహాలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెడుతూనే మరికొన్ని ప్రాజెక్టులను పాన్ వరల్డ్ సినిమాలుగా మారుస్తున్నాడు. వీలైనంత వరకు అన్ని భాషల వారికి నచ్చే విధంగా సినిమాలు చేయాలని ప్రభాస్ కథలను ఓకే చేస్తున్నాడు.

    యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ హారర్ ఇలా అన్ని తరహా జానర్స్ లో సినిమాలు చేయాలని ప్రభాస్ విభిన్నమైన దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు.

    హాలీవుడ్ రేంజ్ లో..

    హాలీవుడ్ రేంజ్ లో..

    ప్రభాస్ ప్రస్తుతం ఎలాంటి సినిమా చేసినా కూడా అంతకు మించి అని ఆలోచిస్తూ ప్రాజెక్టులను ఓకే చేస్తున్నాడు. నిర్మాతలు కూడా ఆయన తన మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. అందరికంటే ఎక్కువగా నిర్మాత సి.అశ్వనీదత్ ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ తో ప్రాజెక్ట్ K నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. హాలీవుడ్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

    ఏమాత్రం బ్రేక్ పడడం లేదు..

    ఏమాత్రం బ్రేక్ పడడం లేదు..

    మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు K లో దీపికా పదుకొన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. షూటింగ్ పనులకు అయితే ఏమాత్రం బ్రేక్ పడడం లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పక్కా ప్రణాళికతో బ్రేక్ రాకుండా షూటింగ్ ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాడు.

     కల నెరవేరింది..

    కల నెరవేరింది..

    అయితే సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపించే ప్రభాస్ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేశాడు. బాలీవుడ్ లెజండరీ యాక్టర్ అమితాబచ్చన్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని అమితాబచన్ తో ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి షాట్ ను పూర్తి చేయడం జరిగిందని ఫోటో పోస్ట్ చేస్తూ ప్రభాస్ పేర్కొన్నాడు.

    అమితాబ్ బచ్చన్ రోల్?

    అమితాబ్ బచ్చన్ రోల్?

    ఇక ప్రభాస్ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. ప్రాజెక్ట్ K సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ గురువుగా ఒక శాస్త్రవేత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్రకు మొదట గెస్ట్ తరహా లోనే ఉంటుంది అనే టాక్ వచ్చింది. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ తర్వాత సినిమా కథలో భాగంగానే ఆయన పాత్ర మొత్తం ఉంటుంది అని వివరణ ఇచ్చాడు.

    English summary
    Prabhas heart touching post with Amitabh Bachchan pic..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X