For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుర్తు పట్టని విధంగా తయారైన ప్రభాస్ (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో 'బహుబలి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌ను భారీ గడ్డంతో చూపెట్టనున్నాడు రాజమౌళి. ఇందులో ప్రభాస్ కాకతీయ కింగ్ గా కనిపించబోతున్నాడు. భారీ యుద్ధ పోరాటాలు, కత్తి పోరాటాలు సినిమాలో భాగమే. ఈ సినిమా కోసం భారీగా గడ్డం పెంచిన ప్రభాస్ ఇలా ఎవరూ గుర్తు పట్టని విధంగా తయ్యారు.

    పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ 'బహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈచిత్రంలో ఇప్పటికే కత్తియుద్ధం, హార్స్ రైడింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ప్రారంభించారు. తాజాగా అడవిశేష్ కూడా ఈ ట్రైనింగులో జాయిన్ అయ్యాడు. ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

    ఈ చిత్రంలో ప్రభాస్-రాణా మధ్య మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. వీరితో పాటు సత్యరాజ్, అనుష్క. అడవి శేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరుకుంది.

    ఈ చిత్రాన్ని దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఆర్కా మీడియా బేనర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి సమర్పకులు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే ఓ వండర్ గా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    English summary
    Prabhas is appearing new look for bahu bali with Heavy beard. The period film that stars Prabhas, Rana Daggubati and Anushka also has the handsome actor Adivi Sesh in a crucial role. Rajamouli directs this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X