twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణంరాజు సంస్మరణ సభ: భోజనాలు చేసి వెళ్ళండి అంటూ ఫ్యాన్స్ తో ప్రభాస్.. ఎంతమందికి రెడీ చేశారంటే..

    |

    రెబల్ స్టార్ కృష్ణంరాజు కనుమూయడం వారి అభిమానులను ఒక్కసారిగా కలచివేసింది. ముఖ్యంగా రెబల్ స్టార్ అయితే ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇక తదుపరి కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రభాస్ ఏమాత్రం జాప్యం లేకుండా తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక ముఖ్యంగా సంస్మరణ సభను కృష్ణంరాజు హోమ్ టౌన్ మొగల్తూరులో నిర్వహించేందుకు ముందుగానే ప్రణాళికలు రచించారు. ఇక నేడు నిర్వహించిన వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఇక వచ్చిన వారందరికీ కూడా కడుపునిండా భోజనం పెట్టి మరి పంపిస్తున్నారు. ఇక మొత్తంగా ఎంతమందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు అనే వివరాల్లోకి వెళితే..

    మనసున్న రాజుల ఫ్యామిలీ

    మనసున్న రాజుల ఫ్యామిలీ

    కృష్ణంరాజు ఫ్యామిలీలో చాలావరకు అందరూ కూడా వచ్చిన ప్రతి అతిధికి కూడా భోజనం పెట్టే పంపించాలి అనే ఆలోచనతోనే ఉంటారు. వచ్చిన వాళ్ళు ధనవంతులు అయినా పేదవారు అయినా ఒకే తరహాలో ట్రీట్ చేసే మంచి గుణం ఉన్న రాజుల ఫ్యామిలీ అంటూ చాలామంది సినీ ప్రముఖులు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఇక ప్రభాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని గుణం గురించి ఫ్యాన్స్ కూడా చాలా దగ్గర ఉండి చూశారు.

     ఫ్యామిలీకి సపోర్ట్ గా..

    ఫ్యామిలీకి సపోర్ట్ గా..

    ఇటీవల పెదనాన్న మృతితో ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక తర్వాత ఆచారాల ప్రకారం కొనసాగాల్సిన కార్యక్రమాలను కూడా దగ్గరుండి చూసుకున్నాడు. కుటుంబ పెద్దగా అలాగే కృష్ణంరాజు ఫ్యామిలీ బాధ్యతలు కూడా ప్రభాస్ తీసుకున్నాడు. పెదనాన్న అయినప్పటికీ కూడా కృష్ణంరాజును ప్రభాస్ సొంత తండ్రిలా భావిస్తాడు. ఆయన వల్లే తాను ఈరోజు స్టార్ అయ్యాను అని గతంలో చాలాసార్లు ప్రభాస్ వివరణ ఇచ్చాడు.

    అందరూ భోజనం చేసి వెళ్ళాలి

    ఇక మొగల్తూరులో భారీ స్థాయిలో సంస్మరణ సభను నిర్వహించగా అక్కడికి చుట్టుపక్కల గ్రామాలనుంచి అలాగే రెండు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అయితే ముందుగా అక్కడికి వచ్చిన వారందరిని పలకరించిన ప్రభాస్ భోజనాలు సిద్ధమయ్యాయి అని అందరూ భోజనం చేసి వెళ్ళాలి అని మైక్ లో చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

    ఫ్యాన్స్ కోసం భోజనాలు

    ఫ్యాన్స్ కోసం భోజనాలు

    గత వారం రోజుల ముందే ఈ సంస్మరణ సభకు సంబంధించిన ఏర్పాట్లను మొదలుపెట్టారు. మొగల్తూరులోని ప్రభాస్ హోమ్ టౌన్ లోనే ప్రత్యేకంగా కొన్ని భోజనాశాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఏ ఒక్క అభిమాని కూడా ఇబ్బంది పడకుండా అలాగే తొక్కిసలాట కూడా జరగకుండా ముందుగానే సెక్యూరిటీని కూడా సిద్ధం చేశారు. ఇక నాన్ వెజ్ అలాగే వెజ్ అని తేడా లేకుండా అన్ని రకాల వంటకాలను సిద్ధం చేశారు.

    మొత్తం ఎంతమందికి అంటే..

    మొత్తం ఎంతమందికి అంటే..

    లక్ష మంది వచ్చినా కూడా అందరూ కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని ప్రభాస్ ముందుగానే తన టీం సభ్యులకు చెప్పి ఖర్చుకు ఏమాత్రం వేరు వెనుకాడకుండా వంటకాలు సిద్ధం చేసి ఉంచాలి అని చెప్పాడట. ఇక ఎంతకైనా మంచిది అని మరో నలభై వేల మంది వచ్చినా కూడా భోజనాలు రెడీగా ఉండేలా చూసుకోవాలని కూడా ముందే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 1 లక్ష 40 వేల మందికి వెజ్, నాన్ వెజ్ తో కూడిన భోజనాలు సిద్ధం చేసినట్లు సమాచారం.

    English summary
    Prabhas hometown Mogulthuru to organize the prayer meeting for Krishnam Raju..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X