ప్రభాస్ లుక్: రాజసం ఉట్టిపడుతోంది!
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' భారీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రభాస్ న్యూ లుక్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. రాజసం ఉంట్టిపడే లుక్‌తో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు.
ఈ చిత్రంలో ఇంకా రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. దాదాపు సంవత్సర కాలంగా షూటింగ్ ప్రక్రియ సాగుతూనే ఉంది. సినిమాను ఎలాగైన ఏప్రిల్ 2015 నాటికి ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించుకున్న రాజమౌళి....స్పీడు పెంచారు.

భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ సెట్టింగులు ఇలా...అన్నింటిలోనూ భారీ తనం ప్రదర్శిస్తున్న ‘బాహుబలి' చిత్రంలో మరో భారీ ప్రత్యేక కూడా ఉంది. ఈ చిత్రం షూటింగ్ కోసం 100 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సినిమాలో ఈ విగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. అందు వల్లే ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని షూటింగు కోసం రెడీ చేసారు.
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తలిసారి. ఈ విగ్రహం బరువు పదుల టన్నుల్లో ఉంటుందని అంచనా. ప్రస్తుతం బాహుబలి చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రభాస్, అనుష్క, ఇతర ముఖ్య తారాగణంపై పాత్రల చిత్రీకరణ జరుగుతోంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ 2015లో ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్కా మీడియావర్క్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, పోరాట సన్నివేశాలతో ఈచిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications











