బాహుబలి లాంటి మరో చిత్రం చేస్తే చావడం ఖాయం.. రాజమౌళి వల్లనే.. ప్రభాస్

దర్శకుడు రాజమౌళిపై హీరో ప్రభాస్‌తోపాటు అందరూ నమ్మకం పెట్టుకొన్నారు కాబట్టే బాహుబలి అద్భుతమైన చిత్రంగా చరిత్రకెక్కింది.

By Rajababu

దర్శకుడు రాజమౌళిపై హీరో ప్రభాస్‌తోపాటు అందరూ నమ్మకం పెట్టుకొన్నారు కాబట్టే బాహుబలి అద్భుతమైన చిత్రంగా చరిత్రకెక్కింది. రాజమౌళిలో ఆత్మవిశ్వాసం చిత్ర యూనిట్‌ను ఐదేళ్లు ముందుకు నడిపించింది. ఒకే చిత్రానికి ఐదేళ్లు పనిచేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కెరీర్‌లో ఎన్నో సినిమాలు, డబ్బును కోల్పోవాల్సి వస్తుందనే ఆలోచనలను పెట్టి ప్రభాస్ అంకుఠిత దీక్షతో బాహుబలికి అంకితమయ్యాడు.

రాజమౌళి పట్టుదలతోనే బాహుబలి

రాజమౌళి పట్టుదలతోనే బాహుబలి

బాహుబలి ది కన్‌క్లూజన్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓ అంగ్ల జాతీయ పత్రికతో ప్రభాస్ ముచ్చటించారు. బాహుబలి లాంటి చిత్రం తీయడం సాధారణమైన విషయం కాదు. రాజమౌళి పట్టుదల వల్లనే అది సాధ్యమైంది. అంతర్జాతీయ, హాలీవుడ్ చిత్రాలకు స్థాయిగా రూపొందిన బాహుబలిలో నటించడం గర్వంగా ఉంది అని ప్రభాస్ పేర్కొన్నాడు.

మళ్లీ బాహుబలిని చేస్తే చనిపోవడం ఖాయం.

మళ్లీ బాహుబలిని చేస్తే చనిపోవడం ఖాయం.

బాహుబలి లాంటి మరో చిత్రంలో నటిస్తే నేను చనిపోవడం ఖాయం. బాహుబలి పాత్రను చేయడం అంత సులభం కాదు. రాజమౌళి అనుభవం, విజన్‌పై నమ్మకం ఉండటం వల్లే బాహుబలి పాత్రను చేయగలిగాను. అలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టడం రాజమౌళికే సాధ్యం అని ప్రభాస్ అన్నారు. బాహుబలి1 తర్వాత మరోసారి ప్రభాస్ మహేంద్ర బాహుబలితో ముందుకు వస్తున్నాడు. 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమాకు సీక్వేల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే.

శరీరాన్ని అనేక రకాలుగా కష్టపెట్టాడు..

శరీరాన్ని అనేక రకాలుగా కష్టపెట్టాడు..

బాహుబలి పాత్ర కోసం నాలుగేళ్లపాటు తన శరీరాన్ని అనేక రకాలుగా కష్టపెట్టాడు ప్రభాస్. ఓ దశలో 100 కిలోలకు పైగా బరువు పెరిగాడు. మళ్లీ వెంటనే పాత్ర డిమాండ్ మేరకు తగ్గాడు. రాజమౌళి కలను తెరపై ఆవిష్కరించేందుకు నాకు నేను పూర్తిగా సన్నద్ధమయ్యాను. మరో చిత్రంలో నటించకూడదని నిర్ణయించుకొన్నాను అని ప్రభాస్ తెలిపారు.

బాలీవుడ్‌లోకి ప్రభాస్..

బాలీవుడ్‌లోకి ప్రభాస్..

బాహుబలి చిత్రం తర్వాత హిందీలో ఓ సినిమా చేయమని రాజమౌళిని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఒత్తిడి చేస్తున్నట్టు జాతీయ పత్రికల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ చిత్రం ద్వారా ప్రభాస్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేయాలని కరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాహుబలి2 చిత్రాన్ని హిందీలో పంపిణీ చేయడంలో కరణ్ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X