కిక్-2 లో రవితేజ కాదా
రవితేజ, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి రూపొందించిన కిక్ చిత్రం మంచి హిట్ ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ఆ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోందని సమాచారం. ఆ స్క్రిప్టు డిస్కషన్ నిమిత్తం సురేంద్రరెడ్డి టీమ్ బ్యాంకాక్ వెళ్లటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే హీరో మాత్రం ప్రభాస్ అని తెలుస్తోంది్. సీక్వెల్ లో కేవలం క్యారెక్టరైజేషన్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. అందులోనూ హీరో పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కిక్ సినిమా ముగుస్తుంది. కాబట్టి సీక్వెల్ లో పోలీస్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా అనూష్క ని ఎంపిక చేసే అవకాశాలన్నాయి. అలాగే బ్రహ్మానందం హల్వా రాజ్ పాత్ర కొత్త మెలికతో అదరకొడుతుందని అంటున్నారు. అయితే ఈ కథలో మంచి లవ్ స్టోరి ఉండేలా తయారు చేస్తున్నారని సమాచారం. బెస్టాఫ్ లక్ కిక్-2. ఇక ప్రస్తుతం ప్రభాస్ తన ఏక్ నిరంజన్ హడావిడిలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











