Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్‌ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
సినీ చరిత్రలో ఆయన గొప్ప నటుడు: సూపర్ స్టార్‌పై ప్రభాస్ ప్రశంసలు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న సాహో విడుదలకు సిద్ధమవుతోంది.
త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే ప్రభాస్ - శ్రద్ధాకపూర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దీని తర్వాత పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది సాహో యూనిట్. ఇక, ముంబైలో కొద్దిరోజులుగా ప్రభాస్ హవా కనిపిస్తోంది. దీంతో సాహో తరచూ హాట్ టాపిక్ అవుతోంది.
ఉత్తరాదిలో ప్రమోషన్ పూర్తి చేసుకున్న సాహో యూనిట్.. శుక్రవారం కేరళకు వెళ్లింది. అక్కడ మీడియా సమావేశం నిర్వహించింది. దీనికి సూపర్ స్టార్ మోహన్ లాల్, మమతా మోహన్ దాస్ సహా పలువురు నటీనటులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్.. మోహన్ లాల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చిన నటీనటులకు ధన్యవాదాలు తెలిపాడు.
మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ.. 'అడిగిన వెంటనే మోహన్ లాల్ సార్ ఇక్కడకు వచ్చారు. మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మనకున్న గొప్ప నటుల్లో మీరు ఒకరు. మీకు నేను పెద్ద అభిమానిని. భారత సినీ చరిత్రలోనే మోహన్ లాల్ సార్ ఒక మంచి నటుడు. ఆయన ఎప్పటికీ యంగ్‌గానే కనిపిస్తున్నారు. మేము ఒకసారి హైదరాబాద్‌లో కలిశాం. అప్పుడు సరదాగా గడిపాం' అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.