twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌లోకి ప్రభాస్.. నాగార్జున భలే ప్లాన్ వేశారే!

    |

    టాలీవుడ్, తెలుగు టెలివిజన్ రంగాలు రెండు భారీ ఈవెంట్లకు వేదిక కాబోతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో విడుదల ఒకటి కగా, అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3. ఈ రెంటింటి విషయాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఇప్పటికే ప్రోమోతో నాగార్జున బుల్లితెర ప్రేక్షకులకు చేరువ కాబోతుంటే.. వెండి తెర ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్రభాస్ అడుగులేస్తున్నాడు. అటు నాగ్, ఇటు యంగ్ రెబల్ స్టార్ కూడా పక్కా ప్లానింగ్‌తో ముందుకొస్తున్నాడు. వారి ప్లాన్స్ ఏమిటంటే..

    బాహుబలి తర్వాత సాహోతో

    బాహుబలి తర్వాత సాహోతో

    బాహుబలి తర్వాత ప్రభాస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన ఇమేజ్‌ను పదిలపరచుకునేందుకు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ సాహో కోసం సుజిత్ రెడ్డితో జతకట్టాడు. బాహుబలికి ముందు తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన ఆయన ఇప్పుడు నేషనల్ స్థాయి హీరో. ఉత్తరాది ప్రేక్షకులకు కూడా సాహో రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఎ్నడూ లేని విధంగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

     రియాలిటీ షోలు టార్గెట్‌గా సాహో టీం

    రియాలిటీ షోలు టార్గెట్‌గా సాహో టీం

    సాహో ప్రచారం కోసం ప్రభాస్, యూవీ క్రియేషన్ ప్లాన్ రెడీ చేశారు. తెలుగులో టాప్ రియాలిటీ షోలలో పాల్గొనేందుకు స్కెచ్ వేశారు. శనివారం ప్రారంభమైన కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా 4 సీజన్‌లో ప్రభాస్‌ను రప్పించేందుకు జీ టెలివిజన్ ప్లాన్ చేసింది. ఈ షోలో త్వరలో సాహో టీమ్ సందడి చేస్తుందని సమాచారం. ఇంకా మిగితా టెలివిజన్ ప్రమోషన్ కార్యక్రమాలతో కేక పెట్టించాలని సాహో యూనిట్ భావిస్తున్నది.

    బిగ్‌బాస్‌లోకి ప్రభాస్, శ్రద్దాకపూర్

    బిగ్‌బాస్‌లోకి ప్రభాస్, శ్రద్దాకపూర్

    సాహో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్‌ను బిగ్‌బాస్‌లోకి రప్పించేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. తొలిసారి ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగ్.. తన షోకు మంచి రేటింగ్ వచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు సమాచారం. ప్రభాస్‌ను షోలోకి రప్పిస్తే కూడా మంచి క్రేజ్ లభించే అవకాశం ఉండటంతో ఈ మేరకు ఈ రెండు టీమ్‌లు సమన్వయంతో ముందుకెళ్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభాస్‌తోపాటు శ్రద్ధాకపూర్ కూడా బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లున్నట్టు సమాచారం.

    జూలై 21న బిగ్‌బాస్ తెలుగు 3

    జూలై 21న బిగ్‌బాస్ తెలుగు 3

    ఇక ఇప్పటికే ప్రారంభ కావాల్సిన తెలుగు బిగ్‌బాస్ షో ప్రపంచ కప్ క్రికెట్ కారణంగా వెనకకు తగ్గింది. ప్రపంచ కప్ ముగిసిన వెంటనే జూలై 21న ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు. సరికొత్తగా నాగార్జునను హోస్ట్‌గా రంగంలోకి దించి ఆకట్టుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో మంచి మార్కులు సంపాదించుకొన్న నాగ్ ఈ షోను ముందుకు తీసుకెళ్తాడని భావిస్తున్నారు.

    English summary
    Tollywood hero Akkineni Nagarjuna as Bigg Boss Host. Star Maa announce officially on June 29th. Star MAA television hopes, They will delivered good things by season 3 Bigg Boss. Apart from this, Reports suggest that Prabhas is going to bigg Boss house for Saaho promotion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X