బాలకృష్ణలాగా ప్రభాస్ సేఫ్ అయినందుకు ఫ్యాన్స్ చాలా హ్యాపీ..!
రవితేజ హీరోగా రూపొందిన 'వీర" చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలయ్యింది. తొలుతగా ఈ సినిమా బాలయ్య చేయాల్సి వుంది. రమేష్ వర్మ ముందుగా ఈ స్టోరీ లైన్ ని బాలయ్యకే వినిపించాడు. కారణాలు తెలీవు కానీ...ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ రవితేజ చేసాడు. అలాగే హై బడ్జెట్ వ్యాల్యుతో 'బద్రినాథ్" సినిమా ముందుగా ప్రభాస్ చేయాల్సి వుంది. కృష్ణంరాజు నిర్మాతగా, ప్రభాస్ హీరోగా రూపొందాల్సిన ఈ చిత్రం ఫైనల్ గా అల్లు అరవింద్ నిర్మాతగా, అల్లు అర్జున్ హీరోగా రూపొందింది. ఈ సినిమా ఘోరపరాజయాన్ని చవిచూడటంతో ప్రభాస్ ఊపిరి పీల్చుకున్నాడట. ఈ రెండు ప్రాజెక్ట్ ల బారీన పడకుండా బాలయ్య, ప్రభాస్ అయ్యారని పరిశీలకులు అంటున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం షూటింగ్ తో బిజీగా ఉండగా, ప్రభాస్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ సక్సెస్ తో ఆనందతో మనిగితేలుతున్నాడని, తన తర్వాతి చిత్రాలి స్క్రిప్ట్ వర్క్స్ డిస్కషన్ లో లీనమై ఉన్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











