»   » 'బాహుబలి' లుక్ కి తిరిగి ప్రభాస్ (ఫొటోలు)

'బాహుబలి' లుక్ కి తిరిగి ప్రభాస్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ తిరిగి తన బాహుబలి లుక్ కి వచ్చేసారు. ఆయన బాహుబలి షూటింగ్ తర్వాత మళ్లీ నార్మల్ కు వచ్చారు. అయితే అతి త్వరలో బాహుబలి 2 ప్రారంభం కానుండటంతో మళ్లీ కండలు పెంచి అప్పటి లుక్ కి రెడి అయ్యారు. అందుకు ఆయన అభిమానులతో రీసెంట్ గా దిగిన ఈ ఫొటోలే సాక్ష్యం.

'బాహుబలి-2' విషయానికి వస్తే...


భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి 100 రోజుల పండుగ ఈ మధ్యన జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకూ ఈ సీక్వెల్ షూటింగ్ మొదలు కాలేదు. అయితే అందుతున్న సమాచారన్ని బట్టి...డిసెంబర్ 14 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆ తేదీ నుంచి ఆర్టిస్టుల డేట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు.


Prabhas is back to his'Baahubali' look

ఈ చిత్రం మొదట అనుకున్న తేదీన కాకుండా రెగ్యులర్ షూటింగ్ లేటు అవటానికి కారణం ..స్క్రిప్టు ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలనే ఆలోచనే కారణం అని తెలుస్తోంది. రాత్రింబవళ్లు ఈ స్క్రిప్టు పైనే పనిచేసిన్నట్లు సమాచారం. మొదట జనవరి 8, 2016 న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు..కానీ ఇప్పుడు మారిందని చెప్పుకుంటున్నారు.


'బాహుబలి' రెండో భాగానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Prabhas is back to his'Baahubali' look

 
'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.

సినిమా ప్రియుల దృష్టి అంతా 'బాహుబలి-2' రిలీజ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజు ఆడియోకు గెస్ట్ గా వెళ్లిన రానా... బాహుబలి 2 చిత్రం 2016 లో కూడా రిలీజ్ కాకపోవచ్చు అన్నట్లు క్లూ ఇచ్చారు.

English summary
Prabhas is back to his 'Baahubali' look.Here are the latest photos with one of his fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu