ప్రభాస్ డబ్బింగ్ చెప్పడంపై... విష్ణు వివరణ

By Bojja Kumar

హైదరాబాద్: హీరో మంచు విష్ణు నటిస్తున్న 'దేనికైనా రెడీ' చిత్రానికి ప్రభాస్ డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డబ్బింగ్ కార్యక్రమం పూర్తయింది. ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడంపై విష్ణు వివరణ ఇస్తూ..'ఈ చిత్రంలో తన పాత్ర ప్రభాస్‌ను అనుకరిస్తుంది. అందుకే ప్రభాస్ డబ్బింగ్ చెప్పలి ఉందన్నారు.

తనకు సినీ పరిశ్రమలో ప్రభాస్, నితిన్, సునీల్ మంచి స్నేహితులని...వారి వాయిస్‌‍ని ఏదో ఒక సినిమాలో అనుకరించడానికి ముందుంటానని విష్ణు చెప్పుకొచ్చారు. తను అడగ్గానే వచ్చి డబ్బింగ్ చెప్పినందుకు ప్రభాస్‌కు థాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు.

'ఢీ'తో తొలి విజయాన్ని ఢీ కొట్టిన మంచు విష్ణుకు ఆ తర్వాత అలాంటి హిట్టు దక్క లేదు. దీంతో ఇప్పుడు 'దేనికైనా రెడీ' అంటున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అది ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.

అందాలతార హన్సిక ఇందులో కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గురించి విష్ణు మాట్లాడుతూ- ''ఆద్యంతం వినోదభరితంగా నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను మలుస్తున్నారు. యువతరాన్ని ఆకట్టుకునే విధంగా హన్సిక పాత్ర ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. నా కెరీర్‌లో ప్రత్యేకస్థానంలో నిలిచే సినిమా ఇది'' అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X