రెబల్ డైరెక్టర్ ని ముప్పతిప్పలు పెడుతున్న మిస్టర్ ఫర్ ఫెక్ట్..
డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రాలు హిట్ అవ్వడంతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ప్రభాస్. అందుకే ఇక నుంచి తను చెయ్యబోతున్న ప్రతి చిత్రంలోనూ అంతో ఇంతో ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ అంశాలను జోడించాలని అనుకుంటున్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్. ఇకపై పూర్తి మాస్ మసాలా చిత్రాలు చేయకూడదని ప్రభాస్ నిర్ణయించుకున్నాడట. అందుకే ప్రస్తుతం తను నటించబోతున్న'రెబల్" కథలో మార్పులు చేయమని లారెన్స్ ను కోరాడట. స్ర్కిప్ట్ తనకు సంతృప్తికరంగా వచ్చే వరకు రెబల్ ను వెనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాస్.
అంతే కాకుండా వరుసగా ప్రభాస్ సినిమాలు హిట్ కావటంతో, రెగ్యులర్ నిర్మాతలు, రైటర్స్ ప్రభాస్ చుట్టు తిరుగటం మొదలుపెట్టారు. వచ్చిన నిర్మాతలకు ప్రభాస్ తల తిరిగే రెమ్యునరేషన్ చెబుతున్నాడని ఫిలింనగర్ న్యూస్. 'డార్లింగ్" సినిమాలో ప్రభాస్ రెండుకోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు మిస్టర్ ఫర్ ఫెక్ట్ హిట్ కావడంతో, ఒక్కసారిగా నాలుగు కోట్లు అడుతున్నాడని పిలింనగర్ న్యూస్.


Click it and Unblock the Notifications











