కొన్నేళ్లు అతడికి దూరంగా ఉంటా: ప్రభాస్ గురించి రాజమౌళి కామెంట్
బాహుబలి, బాహుబలి 2 లాంటి భారీ విజయాల తర్వాత దర్శకుడు రాజమౌళి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్లో ఎవరూ ఊహించని రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ చేసిన ఆయన తెలుగు తెరపై మరో భారీ ప్రాజెక్టకు శ్రీకారం చుట్టబోతున్నారు.
ఈ సినిమా బలమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో స్పోర్డ్స్ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కూడా కనిపించబోతున్నారనే రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఈ వార్తలపై రాజమౌళి స్పందించారు.

ఇద్దరం ఒకరి కొకరంగా కొన్నాళ్లు దూరంగా
ప్రభాస్ నా తర్వాతి సినిమాలో ఉంటాడనే వార్తల్లో నిజం లేదు. మేము ఇద్దరం ఐదు సంవత్సరాల మా జీవితాన్ని బాహుబలి కోసం కేటాయించాం. అందుకే కొంతకాలం ఇద్దరూ కలిసి పని చేయకుండా ఒకరికొకరు దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకున్నామని రాజమౌళి తెలిపారు. ప్రభాస్ ప్రస్తుతం తన ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. నా కమిట్మెంట్స్ నాకు ఉన్నాయి. ఇద్దరం కలిసి భవిష్యత్తులో కలిసి పని చేసే అవకాశం అయితే ఉంది అని రాజమౌళి తెలిపారు.

సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి
ప్రస్తుతం తాను సాధారణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నానని రాజమౌళి తెలిపారు. చాలా సంవత్సరాలుగా స్నేహితులను, ఆత్మీయులను, బంధువులను కలవలేదు. ప్రస్తుతం కాస్త సమయం ఉండటంతో అందరినీ కలుస్తున్నాను.. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నాను అని రాజమౌళి తెలిపారు.

త్వరలో మళ్లీ పనిలో బిజీ బిజీ
త్వరలోనే నా తర్వాతి ప్రాజెక్టు మొదలు కాబోతోంది. మళ్లీ పనిలో మునిగిపోవాల్సి ఉంటుంది. ఆలోగా కలవాల్సిన వారిని కలుస్తున్నాను, వ్యక్తి గత పనులు పూర్తి చేసుకుంటున్నాను అని రాజమౌళి వెల్లడించారు.

సినిమా ఎప్పుడు మొదలవుతుంది?
రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళి తెరకెక్కించనున్నసినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయంలో రాజమౌళి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఇపుడే అన్ని విషయాలు చెప్పలేనని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని రాజమౌళి తెలిపారు.

సాహో షూటింగులో ప్రభాస్
ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నియూవి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











