»   » ప్రభాస్ చాలా బద్దకస్తుడు: రాజమౌళి షాకింగ్ కామెంట్

ప్రభాస్ చాలా బద్దకస్తుడు: రాజమౌళి షాకింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో, ఎంత పని చేస్తాడో.... పర్సనల్ లైఫ్ లోకి వచ్చే సరికి చాలా బద్దకంగా ఉంటాడు. అంత బద్దకస్తున్ని నేను ఎప్పుడూ చూడలేదు... అంటూ దర్శకుడు రాజమౌళి ప్రభాస్ గురించి ఎవరూ ఊహించని కామెంట్ చేసాడు.

సినిమా ప్రమోషన్లో భాగంగా ఓటీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.... ఆ మధ్య ముంబైలో ట్రైలర్ రిలీజ్ కోసం వెళ్లినపుడు మాకంటే ముందే ప్రభాస్ ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. మేం వెనకాల వచ్చాం. డార్లింగ్ ఎక్కడ ఉన్నావ్ అని ఫోన్ చేస్తే ఎంటరైన తర్వాత అక్కడో లాంజ్ ఉంటుంది, అందులో ఉన్నానని చెపాడు.

అక్కడికి వెళ్లాం... మరో అరగంటలో ఫ్లైట్ బయల్దేరుతుంది. శోభుగారు వచ్చి త్వరగా వెల్దాం ప్రభాస్ అన్నాడు.... కానీ ప్రభాస్ ఎలాంటి టెన్షన్ లేకుండా నేనున్నాకదా డాలింగ్.... మీరు కష్టపడాలంటే రాజమౌళితో వెళ్లండి, కంఫర్టు కావాలంటే నాతో రండి అనేసాడు. అప్పటికి ఇంకా సెక్యూరిటీ చెక్ కూడా కాలేదు. ఇంకో 10 నిమిషాలు సమయం ఉండగా.... సెక్యూరిటీ చెక్ చేసే వారు వచ్చి ఇంకో 15 మంది మాత్రమే ఉన్నారు రండి అన్నారు.

Rajamouli

ప్రభాస్ అప్పటికి కూడా ఎలాంటి ఆతురత లేకుండా ఐదురుగు ఉన్నపుడు చెప్పండి వస్తాం అని తాపీగా చెప్పాడు. నాకేమో ఫ్లైట్ మిస్సవుతుందనే టెన్షన్. బాబూ.... ఐదుగురు ఉన్నపుడు నువ్వురా... నేను టెన్షన్ తట్టుకోలేను అని చెప్పేసి వెళ్లిపోయాను. నేను వెళ్లి సెక్యూరిటీ చెక్ చేయించుకుని ఫ్లైట్ దగ్గరకు వెళ్లిన తర్వాత పెద్ద క్యూ ఉంది. ప్రభాస్ క్యూ మొత్తం అయిపోయిన తర్వాత రాయల్ గా వచ్చేసాడు...... అంటూ ప్రభాస్ గురించి గుర్తు చేసుకున్నారు రాజమౌళి.

English summary
"Prabhas nature onscreen is quite contrast to that of offscreen. He puts his heart and soul into the movie while shooting and works so hard. But I have seen very few people who are as lazy as him." director Rajamouli said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu