రాజమౌళి ‘ఈగ’ను ఎప్పుడు తోలుతాడాని ప్రభాస్ పిచ్చి చూపులు...?
'మిస్టర్ ఫర్ ఫెక్ట్"లో ప్రభాస్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో తెలియదుగాని రాజమౌళితో రానున్న చిత్రం గురించి అప్పుడే డిస్కషన్లు మొదలయ్యాయి. 'ఈగ"ను తొందరగానే తోలేసిన తర్వాత ప్రభాస్ చిత్రం ఉంటుందని రాజమౌళి చాన్నాళ్లుగా చెప్తూ వస్తున్నాడు. ఆల్రెడీ 'ఛత్రపతి" తో సూపర్ హిట్ కొట్టిన వీరిద్దరూ ఈసారి 'విశ్వామిత్ర"అనే భారీ చిత్రంతో రానున్నారన్నది మార్కెట్ లో గుసగసలు వినిపిస్తున్నాయి. సుమారు యాభైకోట్ల బడ్జెట్ అంచనాలో ఉన్న 'విశ్వామిత్ర" మరో 'మగధీర" లా ఉంటుందో ఏమో అని అందరూ ఊహిస్తుంటే, రాజమౌళి మాత్రం తాపీగా నేను ఇంకా కథ రెడీ చేసుకోలేదు అంటూ గాలి తీసేశాడు. ఇంకో నెలరోజుల్లో 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" ఎలాగు పూర్తి అయిపోతే రాజమౌళి కథ కోసం, రాక కోసం ప్రభాస్ పిచ్చి చూపులు చూడాల్సిందే...
ప్రభాస్ రాజమౌళి ఈగ విశ్వామిత్ర మగధీర మిస్టర్ ఫర్ ఫెక్ట్ prabhas rajamouli eega viswamitra magadheera mr perfect


Click it and Unblock the Notifications