గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్న ప్రభాస్-ఎన్టీఆర్... ఎందుకో తెలుసా?
Recommended Video

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నారు. ఈ విషయం ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. రాజమౌళి తనయుడు కార్తికేయ కోసం వారు ఈ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.
రమా-రాజమౌళి దంపతుల కుమారుడు కార్తికేయ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నయ్య కూతురు పూజతో కార్తికేయ వివాహం జనవరి 5న జరుగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, ఎన్టీఆర్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

రాజమౌళిపై ఉన్న అభిమానంతో
ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరికీ రాజమౌళి చాలా క్లోజ్. జక్కన్నను తమ ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా చూస్తారు. ఆ అభిమానం, ఇష్టంతోనే ఆయన కుమారుడి వివాహం నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

ఈ నెలలోనే?
ప్రభాస్, ఎన్టీఆర్ ఏర్పాటు చేయబోయే ప్రీ వెడ్డింగ్ పార్టీ డిసెంబర్ నెలాఖరులో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ పార్టీకి ఎవరెవరు వస్తారు? ఎక్కడ జరుగబోతోంది? అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

రాజమౌళిలో ఎన్టీఆర్ అనుబంధం
ప్రభాస్, ఎన్టీఆర్ కెరీర్ ఈ స్థాయికి రావడంలో రాజమౌళి కీలక భూమిక పోషించారనేది ఎవరూ కాదనలేనిది. ఎన్టీఆర్ మూవీ ‘స్టూడెంట్ నెం.1'తో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన రాజమౌళి... ఆ తర్వాత యంగ్ టైగర్‌తో సింహాద్రి, యమదొంగ సినిమాల బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘ఆర్ఆర్ఆర్' అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

రాజమౌళి-ప్రభాస్
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘ఛత్రపతి' అప్పట్లో పెద్ద విజయం సాధించింది. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి', బాహుబలి 2 చిత్రాలు ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రేమ వివామం
కాగా... కార్తికేయ, పూజ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడంతో పెళ్లికి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్లో వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

రామానాయుడు స్టూడియోలో వివాహం
వీరి పెళ్లి వేడుకకు రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి కార్తికేయ, పూజ వివాహమహోత్సవం ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో పెళ్లి పనులు ఊపందుకున్నాయి.


Click it and Unblock the Notifications











