బన్నీ పుట్టినరోజు వేడుకతో ఘనంగా విడుదలయిన 'డార్లింగ్' ఆడియో
ప్రభాస్, కాజల్ జంటగా నటించిన సినిమా డార్లింగ్. రొమాంటిక్ ప్రేమకథలను తీయడంలో తనదైన ముద్రను వేసుకున్న కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో నిన్న (ఏప్రిల్ 9న) హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఎఆర్ రెహమాన్ మేనల్లుడు జివి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇది ఈయన తొలి తెలుగు స్ట్రెయిట్ సినిమా కావడం గమానార్హం. తమిళంలో ఎన్నో సినిమాలకు పనిచేసిన ఈయన రజనీకాంత్ హీరోగా నటించిన కుచేలన్(తెలుగులో కథానాయకుడు) సినిమాకు కూడా సంగీతాన్ని అందించాడు.
ఈ ఆడియో విడుదల ఫంక్షన్ కు టాలీవుడ్ అతిరథమహులంతా తరలివచ్చారు. హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ, దర్శకులు యస్ యస్ రాజమౌళి, మెహర్ రమేష్, పూరీ జగన్నాథ్, నిర్మాతలు దిల్ రాజు, బివిఎన్ ఎస్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నాయిక కాజల్ తదితరులు హాజరయ్యారు. ఇదే వేధికపై హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు.
తమిళ నటుడు ప్రభు ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా శ్రద్ధా దాస్ కు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రభాస్ తో ఇంతకు ముందు ఛత్రపతి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ వెకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు వున్నాయి.


Click it and Unblock the Notifications











