కాజల్ తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ భేషుగ్గా ఉంటుంది...!
ప్రభాస్, కాజల్ జంటగా నటించిన డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ ఇద్దరిది సక్సెస్ ఫుల్ జంటగా కొనియాడుతున్నారు అందరూ. ఇక ఈ ఈ జోడి ఒకరి మీద ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకుంటున్నారు. కాజల్ తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేయడం కుదిరినంతగా మరే హీరోయిన్ తో కుదరదు అని ప్రభాస్ అంటుంటే, ప్రభాస్ ఎవరికైనా నచ్చే మనిషని, వెండితెరపై తన డార్లింగ్ ప్రభాసే అని కాజల్ చెబుతోంది. అంతే కాదు మా ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అవుతుందని చెబుతోంది కాజల్.
కాగా త్వరలోనే ప్రభాస్, కాజల్ కలయికలో ముచ్చటగా మూడో సినిమా కూడా రాబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని సమాచారం. మరో ప్రక్క ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో తను 'రెబల్" అనే చిత్రంలో ప్రభాస్ హీరోగా, అనుష్క కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో కాజల్ తో ఓ కీలక పాత్ర చేయించడానికి ప్రభాస్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. అలాగే రాజమౌళి దర్శకత్వంలో తను చేయబోతున్న చిత్రంలో కూడా కాజల్ తో ఓ ప్రధాన పాత్ర చేయించమని రాజమౌళి దగ్గర ప్రభాస్ కోరినట్టు సమాచరం..


Click it and Unblock the Notifications











