బాడీగార్డ్ బర్త్ డే..పనిలోపని ఆడియో ఫంక్షన్ కి ప్రభాస్, కార్తీ ఛీఫ్ గెస్ట్..!
విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ ఈ రోజు తన 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1960 లో మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు గారి కుటుంబలో పుట్టి చెన్నైలో పుట్టి అక్కడే తన చదువు పూర్తి చేసుకున్నారు. 1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో రంగప్రవేశం చేసిన వెంకటేష్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. 7 నంది అవార్డులు మరియు 4 ఫిలిం ఫేర్ అవార్డులు ఆయన గెలుచుకున్నారు. బొబ్బిలి రాజా, స్వర్ణ కమలం, శత్రువు, కూలీ నెం 1, క్షణం క్షణం, ధర్మ చక్రం, చంటి, ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావ్ వంటి పలు హిట్ చిత్రాల్లో ఆయన నటించారు.
విక్టరీ వెంకటేష్ తో ముచ్చటిస్తే ఆయన మాటల్లో సినిమా సంగతులకంటే ఆధ్యాత్మిక విషయాలే ఎక్కువ చర్చకు వస్తాయి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో జీవితం తాలూకు తాత్విక చింతన తొంగిచూస్తుంది. జయాపజయాలకు అతీతంగా సినిమాని ప్రేమిస్తారాయన. విలక్షణ పాత్రలతో తెలుగు సినిమాలో కుటుంబ చిత్రాల కథానాయకుడిగా తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్నారు వెంకటేష్ 'మనం చేసే పనిని నిజాయితీగా చేయాలి. ఫలితం ఎలా వున్నా స్వీకరించాలి' అన్నది ఆయన నమ్మిన ఫిలాసఫీ.
తాజాగా ఆయన 'బాడీగార్డ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. నేడు వెంకటేష్ జన్మదినం. ఈ సందర్భంగా తన అభిమానులకు కానుక ఇవ్వబోతున్నాడు వెంకటేష్. అది 'బాడీగార్డ్' కానుక. హైదరాబాద్ లోని శిల్పకళా వేధికలో వెంకటేష్ అభిమానలు సమక్షంలో ఈ వేడుక జరగనుంది కాబట్టి వెంకీ అభిమానలకు ఇది మంచి కానుగా భావించవచ్చు. ఈ వేడుకలో ప్రభాస్, వినాయక్, కార్తీ ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు.
కుటుంబ చిత్రాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్నేహితులని సంపాదించుకున్నారు. వెంకటేష్ బాడీగార్డ్ చిత్రం తర్వాత మహేష్ బాబుతో మల్టి స్టారర్ సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్న వెంకటేష్ గారికి దట్స్ తెలుగు తరపున బెస్ట్ విషెస్ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం...


Click it and Unblock the Notifications











