త్వరలో ప్రభాస్ ప్రభంజనం...కార్పొరేట్ కంపెనీల క్యూ!
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యూత్, కాలేజీ కుర్రాళ్లు ప్రభాస్ అంటే పడి చస్తారు. మరో వైపు అమ్మాయిలు కూడా ప్రభాస్ ఫిజిక్, పెర్ఫార్మెన్స్ అంటే తెగ ఇష్ట పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కార్పొరెట్ కంపెనీలు ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు ట్రై చేస్తున్నాయి.
ఇటీవల ఓ టూత్ పేస్ట్ కంపెనీ ప్రభాస్‌ను సంప్రదించి డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేసిందని, అయితే 'బాహుబలి' సినిమా పూర్తయ్యే వరకు తాను ఎలాంటి కమిట్మెంట్లు తీసుకోదలుచుకోలేదని చెప్పినట్లు సమాచారం. దీన్ని బట్టి 'బాహుబలి' సినిమా తర్వాత ఆయన వ్యాపార ప్రకటనల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పలు కార్పొరేట్ సంస్థలు ప్రభాస్ మేనేజర్‌ను సంప్రదించి ముందస్తుగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

'బాహుబలి' సినిమా విషయానికొస్తే... తాజాగా చిత్రం షూటింగ్ నిలిపి వేసారు. ఇంతకాలం విరామం లేకుండా, అలుపు ఎరుగకుండా పని చేసిన టీం మొత్తం.......కొంతకాలం రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ బ్రేక్ ఇచ్చారు. ఈ విషయాన్ని బాహుబలి అఫీషియల్ వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగును రివ్యూ చేసుకోవడానికి, నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి ఈ బ్రేక్ బాగా ఉపయోగ పడుతుందని అంటున్నారు.
అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ బ్రేక్‌లోనూ పని చేస్తున్నారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుతో కలిసి ఎడిటింగును పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్, పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ప్రస్తుతం రెండు సాంగులను రీ రికార్డింగ్ చేస్తున్నారు. తర్వాతి షెడ్యూల్‌లో హీరోయిన్ తమన్నా షూటింగులో జాయిన్ కాబోతోంది.
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది.
ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











