ఆ విషాదంతో ఆగిపోయిన ప్రభాస్ పాన్ ఇండియా మూవీ.. క్యాన్సిల్ అవ్వలేదు కానీ..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి అనంతరం ప్రతి అడుగు అంతకు మించి అనేలా ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ వద్దకు కూడా ఎక్కువగా పాన్ ఇండియా కథలే వస్తున్నాయి. ఇక KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఇటీవల ఒక విషాదం కారణంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన టాపిక్ ని పక్కన పెట్టాల్సి వచ్చింది.
Recommended Video

త్వరలోనే విదేశాలకు
ప్రభాస్ నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జిల్ దర్శకుడు రాధా మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు టాక్ వస్తోంది. ఇక రీసెంట్ గా విషాదంతో ప్రభాస్ గ్యాంగ్ బాధకు గురైంది.

అంత్యక్రియలకు రామ్ చరణ్, శర్వా హాజరు
ప్రభాస్ కి అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో యూవీ క్రియేషన్స్ అధినేత వంశీ ఒకరు. ఇటీవల వంశీ ఇంట్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. వారి తండ్రి పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హఠాత్తుగా కన్నుమూశారు. ఒక్కసారిగా ఈ ఘటన యూవీ క్రియేషన్స్ ని కలచి వేసింది. ఇక అంత్యక్రియలు నెల్లూరులో జరుగగా కార్యక్రమానికి రామ్ చరణ్, శర్వానంద్ హాజరయ్యారు.

KGF దర్శకుడితో కొత్త మూవీ
ఇక కొన్ని రోజుల క్రితమే ప్రభాస్, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ఒక ప్రాజెక్టు గురించి చర్చలు జరిగాయి. ఆల్ మోస్ట్ ఒకే అవుతున్న సమయంలో సడన్ గా నిర్మాత వంశీ తండ్రి మరణించారు. దీంతో ఒక్కసారిగా వారికి షాక్ తగిలినట్లయ్యింది. ప్రభాస్ కూడా ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించకుండా ఫ్యామిలీతోనే ఉండమని వంశీకి సలహా ఇచ్చారట. దీంతో ఆ కాంబినేషన్ కి బ్రేక్ పడ్డట్లు సమాచారం. ఒక రెండు నెలల తరువాత వీరి కాంబోపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











