మళ్ళీ ఆ హీరో పైనే కన్నేసిన కొరటాల శివ!
భరత్ అనే నేను చిత్రంలో కొరటాల టాలీవుడ్ లో తిరుగులేని డైరెక్టర్ గా అవతరించారు. కొరటాల తెరకెక్కించిన నాలుగు చిత్రాలు ఘనవిజయాలే కావడం విశేషం. రాజమౌళి తరువాత స్థానం కొరటాల శివదే అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షుకులని మెప్పించడం కొరటాల శైలి.
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, తాజగా వచ్చిన భరత్ అనే నేను చిత్రాలు అదే కోవకు చెందినవి. భరత్ అనే నేను చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న కొరటాల తన తదుపరి చిత్రానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొరటాల నెక్స్ట్ మూవీ హీరోగా కొందరి హీరోల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం కొరటాల నెక్స్ట్ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొరటాల దర్శకుడిగా చేసిన మొదటి చిత్రం మిర్చి ప్రభాస్ తోనే కావడం విశేషం. మిర్చి చిత్రం అప్పటికి ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం కొరటాల ప్రభాస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











