»   »  బాహుబలి: కేంద్ర హోం మంత్రిని కలిసిన ప్రభాస్, కృష్ణం రాజు

బాహుబలి: కేంద్ర హోం మంత్రిని కలిసిన ప్రభాస్, కృష్ణం రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' చిత్రం భారీ విజయం సాధించింది. తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టడమే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినిమా రేంజిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. ఈ సినిమాను చూసిన ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా చూడబోతున్నారు. శనివారం ప్రభాస్, కృష్ణం రాజు ఆయన్ను కలిసారు. ఈ విషయాన్ని రాజ్‌నాథ్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడిస్తూ వారిద్దరితో కలిసి దిగిన ఫోటోను కూడా పోస్టు చేసారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా విజయవంతంగా 3వ వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో ఈ చిత్రం షేర్ రూ. 100 కోట్లకు చేరువ కాగా, హిందీలో రూ. 70 కోట్ల మార్కును అధిగమించింది. ఇప్పటి వరకు ఏ సౌతిండియన్ సినిమా ఈ రేంజిలో కలెక్షన్లు సాధించలేదు. బాలీవుడ్ రెగ్యులర్ సినిమాలతో సమానంగా అక్కడ బాహుబలి సినిమా ఆదరణ లభిస్తుండటం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది.

 Prabhas and Krishnam Raju met Rajnath Singh

బాహుబలి పార్ట్ 1 విజయవంతం కావడంతో పార్ట్ 2 కోసం భారతీయ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి' పార్ట్ -2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై హీరో ప్రభాస్ స్పష్టత ఇచ్చారు. షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి మొదలవుతుందని తెలిపారు. పార్ట్ 2కు సంబంధించి షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారు.

ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది, యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో సెకండ్ పార్ట్ రాబోతోంది. 2016లో ఈ సినిమా విడుదల కానుంది.

English summary
"Met noted film actor Prabhas and Shri Krishnam Raju today. Looking forward to watch Prabhas' latest film 'Bahubali'" Rajnath Singh said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu