లవ్ యాక్షన్ ఫిలిమ్ 'డార్లింగ్'..క్లీన్ 'యు'
ప్రభాస్, కాజల్ జంటగా 'తొలిప్రేమ' కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన 'డార్లింగ్' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం కథ గురించి నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ మాట్లాడుతూ...నిర్మాత ప్రభాస్ (ప్రభాస్) సరదాగా ఉండే యువకుడు. తనతో ఉన్నవారందరూ సంతోషంగా ఉండాలనుకుంటాడు. నందిని (కాజల్)ని చూసిన క్షణాన ప్రేమలోపడతాడు. వీళ్ల ప్రేమాయణం కాస్త వైవిధ్యంగా ఉంటుంది. అదేమిటన్నది తెర మీదే చూడాలి అంటున్నారు. అలాగే, 'మంచి ఫీల్‌గుడ్ చిత్రంగా 'డార్లింగ్' సెన్సార్ సభ్యులందరి ప్రశంసలు పొందింది. ఇది లవ్ స్టోరీ అయినప్పటికీ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన ఆడియోకు విశేష స్పందన లభిస్తోంది. ప్రభాస్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ప్రింట్స్ తో ఈనెల 23న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం' అన్నారు.


Click it and Unblock the Notifications











